ETV Bharat / state

Spoiled Medicine: ఉచిత ఔషధాలకు చెద.. కాలేజీ హాస్టల్‌లో మూలుగుతున్న నిల్వలు

Spoiled Medicine: గుంటూరు సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్స్‌ (సీడీఎస్‌)లో రూ.కోట్ల విలువ చేసే ఉచిత మందులకు చెద పట్టింది. వినియోగ గడువు ముగియడంతో వాటిని నేలపాలు చేయటానికి రంగం సిద్ధం చేశారు. . 2019, 2020లలో కొనుగోలు చేసిన ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, సిరంజీలు, సెలైన్‌ బాటిళ్లు సహా కొన్ని మందులన్నీ వృథాగా మారాయి.

medicines spoiled at guntur central drug store
గుంటూరు మెడికల్‌ కాలేజీ హాస్టల్‌లో మూలుగుతున్న మందులు
author img

By

Published : May 4, 2022, 9:06 AM IST

Spoiled Medicine: గుంటూరు సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్స్‌ (సీడీఎస్‌)లో రూ.కోట్ల విలువ చేసే ఉచిత మందులకు చెద పట్టింది. వినియోగ గడువు ముగియడంతో వాటిని నేలపాలు చేయటానికి రంగం సిద్ధం చేశారు. ఈ భవనం మందుల పెట్టెలతో నిండింది. ఇంకా మిగిలి ఉన్న మందులను అమరావతి రోడ్డులోని మెడికల్‌ కాలేజీ హాస్టల్‌లో కొన్ని గదుల్లో అడ్డదిడ్డంగా పడేశారు. వీటిల్లో గడువు తీరినవి తెలియక ఉద్యోగులు నానా అవస్థలు పడుతున్నారు. 2019, 2020లలో కొనుగోలు చేసిన ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, సిరంజీలు, సెలైన్‌ బాటిళ్లు, రక్తం గడ్డకట్టకుండా ద్రవ రూపంలో ఇచ్చే లిక్విడ్‌ మందులు, పీపీఈ కిట్లు, ఆఫ్రాన్లు, సర్జికల్స్‌ అన్నీ వృథాగా మారాయి.

ఈ-ఔషధి ఉన్నా..: ఆసుపత్రులకు కావాల్సిన ఉచిత ఔషధాలు, సర్జికల్స్‌ ప్రతిదీ ఈ-ఔషధి సైట్‌లో అప్‌లోడ్‌ చేసి పంపుతారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ ఏ మందులున్నాయి? ఇంకా ఏం కావాలి? మిగులు ఉన్నవాటిని ఎక్కడికి సర్దుబాటు చేయొచ్చో వైద్య, మౌలిక సదుపాయాల కల్పన అభివృద్ధి సంస్థ (ఏపీఎంఎస్‌ఐడీసీ) అధికారులకు తెలుస్తుంది. ఆసుపత్రులకు వారు పంపిణీ చేయకుండా సీడీఎస్‌లో నిల్వచేసి వినియోగానికి పనికిరాకుండా చేశారనే విమర్శలున్నాయి. వాటి విలువ రూ.కోట్లలోనే ఉంటుందని అంచనా.

మెడికల్‌ కాలేజీ హాస్టల్‌లో చిందరవందరగా పడేసిన మందులు ఎలుకలు, పందికొక్కులకు ఆహారంగా మారాయి. కృష్ణా పుష్కరాలు, ఇతర కార్యక్రమాల నిర్వహణకు వచ్చిన ఔషధాలూ వీటిల్లో ఉన్నాయి. వరుసగా రెండేళ్లు కొవిడ్‌ మహమ్మారితో నెలల తరబడి అవుట్‌పేషంట్‌ సేవలు నిలిపేయటంతో మందులు వినియోగం కాలేదని, నిల్వలు పేరుకుపోవటానికి ఇదో కారణమని చెబుతున్నారు.

తూతూమంత్రంగా డ్రగ్స్‌ కమిటీ సమావేశం..: గుంటూరు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌, జిల్లా వైద్యాధికారి, ఏపీవీపీ ఆసుపత్రుల జిల్లా సమన్వయకర్త, సీడీఎస్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌తో కూడిన డ్రగ్స్‌ కమిటీ ఉంది. వీరు నెలవారీ సమావేశమై పీహెచ్‌సీ, సామాజిక ఆసుపత్రులు, బోధనాసుపత్రుల నుంచి వస్తున్న మందులు, సర్జికల్స్‌ ఇండెంట్లు ఏమిటి? అవి స్టోర్‌లో ఉన్నాయా? లేవా? తనిఖీలు చేయాలి. స్టోర్‌లో నిల్వలు ఉంచుకుని ఇండెంట్‌ మేరకు పంపకపోతే ప్రశ్నించాలి. ఇది సక్రమంగా జరగక ఈ పరిస్థితి ఏర్పడిందని కొందరు వైద్యులు పేర్కొంటున్నారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.