గుంటూరు జిల్లా తెనాలి.. అరుదైన వివాహ వేడుకకు వేదికైంది. తెనాలికి చెందిన పూలివర్తి దిలీప్ కుమార్ ఏరోనాటికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. హైదరాబాద్ లో ఏరోఫాల్కన్ ఏవియేషన్ పేరిట సంస్థను నిర్వహిస్తున్నారు. దిలీప్‌కు హైదరాబాద్‌కు చెందిన కమలాబాయితో వివాహం కుదిరింది.
తమ పెళ్లిని ఎప్పటికీ మరచిపోలేని విధంగా చేసుకోవాలని ఇద్దరూ నిర్ణయించారు. ఈ మేరకు 21వ తేదిన తెనాలిలోని గౌతం గ్రాండ్ హోటల్లో మూడు మతాచారాల ప్రకారం వివాహ కార్యక్రమం నిర్వహించారు. మధ్యాహ్నం 2 గంటలకు బంధుమిత్రుల సమక్షంలో క్రైస్తవ సంప్రదాయం ప్రకారం పాస్టర్ దీవెనల మధ్య వివాహం జరిగింది. సాయంత్రం ముస్లిం మతపెద్దలు చేసిన దువాతో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. రాత్రి హిందూ విధానంలో వధువు మెడలో దిలీప్ తాళి కట్టారు. ఇలా మూడు సంప్రదాయాలు అనుసరించి దిలీప్, కమల దంపతులయ్యారు.
ఇదీ చదవండి: