గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ప్రజ్వలిత సాంస్కృతిక సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు, కళాభిమాని నాగళ్ల దుర్గాప్రసాద్ మృతి కళారంగానికి తీరని లోటని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అభిప్రాయపడ్డారు. దుర్గాప్రసాద్ సంతాప సభకు నాదెళ్ల హాజరయ్యారు. సాహితీ, సాంస్కృతికరంగాల్లో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.
యువత సాహిత్యం వైపు మక్కువ చూపేలా పలు సదస్సులు.. అవగాహన కార్యక్రమాలు చేపట్టారని మనోహర్ గుర్తుచేశారు. తెనాలి వేదికగా ఎన్నో సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారని.... రంగస్థల కళాకారుల సంఘం అధ్యక్షుడిగా కళాకారుల కోసం సొంత భవన నిర్మాణంలో తనవంతు పాత్ర పోషించారని కొనియాడారు.
ఇదీ చదవండి:
రేపే కామధేను పూజ.. నరసరావుపేటలో హాజరుకానున్న సీఎం