వైకాపా ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడితే.. పోరాటాలు చేస్తామని భాజపా నేత పైడికొండల మాణిక్యాల రావు స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో భాజపా సభ్యత్వ కార్యక్రమానికి హాజరయ్యారు. భాజపాలోకి అన్ని పార్టీల నాయకులు చేరడంపై హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేత చిరంజీవి వచ్చినా.. స్వాగతిస్తామని వెల్లడించారు. సీఎం జగన్-కేసీఆర్ చర్చను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. గోదావరి నీళ్ల మళ్లింపుపై ప్రజలకు వివరణ ఇవ్వాలన్నారు.
ఇవీ చదవండి...చిరంజీవికి హైకోర్టులో ఊరట