తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల్లో ఎక్కడైనా అభివృద్ధి జరిగినట్లు నిరూపిస్తే.. తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని.. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. తాను రైతులను కాకుండా వేరేవారిని ముఖ్యమంత్రి దగ్గరకు తీసుకెళ్లానని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు అవాస్తవాలని స్పష్టం చేశారు. తాను తీసుకెళ్లిన వారందరికీ ఉండవల్లి గ్రామంలో భూములున్నాయని చెప్పారు. రాజధానిపై రెఫరెండం నిర్వహిస్తే తెదేపాకు ఇప్పుడున్న 23 సీట్లు సైతం రావన్నారు.
ఇవీ చదవండి: