.
మందడంలో రైతుల ఆందోళన.. రోడ్డుపై బైఠాయింపు - మందడంలో రైతుల ధర్నా
మూడు రాజధానులంటూ సీఎం చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. అమరావతి రైతులు ఆందోళన బాటపట్టారు. మందడంలో రైతులు కుటుంబాలతో రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. రైతుల ఆందోళనతో సచివాలయం మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. సచివాలయానికి వెళ్లే మార్గాల్లో ఎక్కడికక్కడ పోలీసు పికెట్లు ఏర్పాటు చేశారు. 29 గ్రామాల్లో పోలీసు బందోబస్తు ఏర్పాట్లను గ్రామీణ ఎస్పీ సమీక్షించారు.
mandadam-darna-in-amaravathi
.