ETV Bharat / state

రుణాన్ని చెల్లించలేక వ్యక్తి ఆత్మహత్యాయత్నం - రుణాలు చెల్లించలేక వ్యక్తి ఆత్మహత్యాయత్నం వార్తలు

అవసరానికి తీసుకున్న రుణాన్ని సకాలంలో చెల్లించలేక ఓ వ్యక్తి కత్తితో పొడుచుకుని ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా పొన్నెకల్లులో జరిగింది. ఒకేసారి అప్పు మొత్తం చెల్లించమని.. రుణం ఇచ్చిన వారు ఒత్తిడి చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బాధితుడు గోపికృష్ణ వాపోయాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

man suicide attempt in guntur district for not able to pay the debts
రుణాన్ని చెల్లించలేక వ్యక్తి ఆత్మహత్యాయత్నం
author img

By

Published : Feb 6, 2021, 2:16 PM IST

గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నెకల్లులో ఓ వ్యక్తి కత్తితో పొడుచుకుని ఆత్మహత్యకు యత్నించాడు. అప్పు ఇచ్చిన యజమాని నెమలికంటి దీక్షమూర్తి ఇంటి ముందే గోపికృష్ణ ఆత్మహత్యకు యత్నించాడు. తీవ్రంగా గాయపడిన గోపికృష్ణను చికిత్స నిమిత్తం.. స్థానికులు గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

తీసుకున్న రుణాన్ని ఒకేసారి చెల్లించాలని ఒత్తిడి

రెండేళ్ల క్రితం దీక్షమూర్తి దగ్గర.. గోపికృష్ణ రూ.1 లక్ష 50వేల నగదును రెండు రూపాయల వడ్డీకి తీసుకున్నాడు. రెండు నెలలు వడ్డీ కట్టిన తరువాత లాక్​డౌన్ సమయంలో.. పది రూపాయల వడ్డీ చెల్లించాలని వేధించాడు.రూ.10 వడ్డీ చెల్లించలేకపోతే తీసుకున్న మొత్తం ఒకేసారి ఇవ్వాలని దీక్షమూర్తి డిమాండ్ చేశాడు. నెలల వారీగా రుణాన్ని చెల్లిస్తానన్న ఒప్పుకోలేదని బాధితుడు వాపోయాడు.

ఆర్థిక పరిస్థితి బాగాలేక..

వస్త్ర దుకాణం నడుపుతున్న గోపికృష్ణ.. తన ఆర్ధిక పరిస్థితి బాగాలేకపోవడం, దానికి తోడు అనారోగ్య కారణాలతో సకాలంలో తీసుకున్న రుణాన్ని తీర్చలేదని వాపోయాడు. ఒకేసారి అప్పు మొత్తం చెల్లించమని ఒత్తిడి చేయడంతో.. మనోవేదనకు గురై కత్తితో పొడుచుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు గోపికృష్ణ ఆవేదన వ్యక్తం చేశాడు. ఘటనపై తాడికొండ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

రుణాన్ని చెల్లించలేక వ్యక్తి ఆత్మహత్యాయత్నం

ఇదీ చదవండి: భవన యజమానిని ప్రశ్నించినందుకే..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.