ETV Bharat / state

లిఫ్ట్ గదిలో పడి వ్యక్తి మృతి - guntur crime news

నిర్మాణంలో ఉన్న లిఫ్ట్​ గదిలో పడి వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా వినుకొండలో జరిగింది. నగదు ఉపసంహరణ చేయటానికి ఓ ప్రముఖ బ్యాంకు వెళ్లగా... మెట్లపై వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

died
మృతి
author img

By

Published : Jun 15, 2021, 4:49 PM IST

గుంటూరు జిల్లా వినుకొండలోని ఓ ప్రముఖ బ్యాంకులో నగదు ఉపసంహరణ చేసేందుకు వెళ్లిన వ్యక్తి.. ప్రమాదవశాత్తు నిర్మాణంలో ఉన్న లిఫ్ట్ గదిలో పడి మృతి చెందాడు. నూజెండ్ల మండలం గొల్లపాలెం గ్రామానికి చెందిన మారెళ్ల ఎలమందారెడ్డి (58) పట్టణంలో మొదటి అంతస్తులో ఉన్న ఓ ప్రముఖ బ్యాంకులో నగదు తీసుకునేందుకు మెట్లపై వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. క్షతగాత్రుడిని వినుకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించగా... చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు సంతానం ఉన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి

Alapati:'రెండు నెలల్లో ఆరు సార్లు దాడి..అతనిపై రౌడీషీట్ తెరవాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.