మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కోటప్పకొండకు ప్రభలు కట్టి తరలించే క్రమంలో గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో అపశృతి చోటు చేసుకుంది. పట్టణ పరిధిలోని పురుషోత్తమ పట్నంలో ప్రభ వద్ద విద్యుత్ ఘాతానికి గురై ఓ కార్మికుడు మృతిచెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని తోట పుల్లప్పగారి ప్రభ పండుగను శనివారం రాత్రి నిర్వహించారు. అనంతరం ప్రభకు విద్యుత్ దీపాలు ఏర్పాటుచేసిన సిబ్బంది తిరిగి వాటిని ఇవాళ తీసేసే పనిలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో.. ప్రభకు హై టెన్షన్ తీగలు తగిలి విద్యుత్ సరఫరా అయింది.
ఈ సమయంలో పనులు చేస్తున్న కార్మికుడు పిట్టల శీను (40) విద్యుత్ఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మరొక కార్మికుడు ఇజ్రాయెల్‌కు తీవ్ర గాయాలు కాగా.. ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. మృతుడు పిట్టల శీను రాజుపాలెం మండలం చౌటపాయపాలెం వాసుడిగా గుర్తించారు. అతనికి భార్య, ముగ్గురు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు.
ఇదీ చదవండి :