గుంటూరు జిల్లా నగరం మండలంలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. తాడివాకవారిపాలెం గ్రామానికి చెందిన టి.గుడారావు (72) కు ,అదే గ్రామానికి చెందిన పి.సత్యనారాయణ (45) అనే వ్యక్తికి 18 వ తేదీ సాయంత్రం ఇంటి స్థలానికి సంబంధించి వివాదం జరిగింది. ఇరువురి మధ్య ఘర్షణ జరగడంతో గ్రామ పెద్దలు వచ్చి వివాదాన్ని పరిష్కరించారు.
ఈ క్రమంలోనే... 19వ తేదీన గుడారావు తన స్వగృహంలో చనిపోయాడు. మెడపై గాయాలు గమనించిన కుటుంబసభ్యులు... పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి: