గుంటూరు జిల్లా మాచర్లలో ప్రమాదవశాత్తు విద్యుత్ తీగ తగిలి ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడు 7వ వార్డుకు చెందిన ముప్పాళ్ల సైదులుగా స్థానికులు తెలిపారు. ఇటీవల కురిసిన వర్షానికి సైదులు ఇంటి వెనుక ఉన్న కాల్వ పూడిక తీస్తుండగా తెగిపడిన విద్యుత్ తీగ అతనికి తగిలింది. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. 4రోజుల క్రితమే మృతుని తండ్రి కూడా అనారోగ్యంతో మరణించాడు. ఈ రెండు ఘటనలు కొద్ది వ్యవధిలోనే జరగడం వల్ల మృతుని కుటుంబంలో విషాదం నెలకొంది.
ఇదీ చదవండి :