నరసరావుపేట మండలం గుంటూరు-కర్నూలు ప్రధాన రహదారిపై లారీ బోల్తా పడింది. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్ల ప్రమాదం జరిగి ఉండవచ్చని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు. పెట్రోల్ ట్యాంకర్ లారీ ఖాళీగా ఉండటం వల్ల పెనుప్రమాదం తప్పింది. ప్రధాన రహదారిపై ప్రమాదం జరగడం వల్ల భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. నరసరావుపేట గ్రామీణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి :