ETV Bharat / state

'ఇసుక అమ్ముతోంది ఏపీ... తింటోంది వైసీపీ' - lokesh fasting on sand deficit in ap

భవన నిర్మాణ కార్మికులు ఒక్కసారి తిరగబడితే వైకాపా ప్రభుత్వ పునాదులు కదులుతాయని... తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హెచ్చరించారు. ఇసుక కొరతపై గుంటూరులో నిరాహార దీక్ష చేసిన లోకేశ్... ప్రభుత్వ ఇసుక విధానాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. వైకాపా నేతలు కృత్రిమ ఇసుక కొరత సృష్టించి... అధిక ధరకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. దేశంలో ఇసుక అమ్ముకుంటున్న ఏకైక రాష్ట్రం ఏపీ అని ఎద్దేవా చేశారు. ఇసుకను మేస్తోంది వైకాపా నేతలేనని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

ఇసుక అమ్ముతోంది ఏపీ... తింటోంది వైసీపీ : లోకేశ్
author img

By

Published : Oct 30, 2019, 7:23 PM IST

Updated : Oct 30, 2019, 7:43 PM IST

నారా లోకేశ్

రాష్ట్రంలో ఇసుక కొరతపై పోరాటాన్ని తెలుగుదేశం ఉద్ధృతం చేసింది. భవన నిర్మాణ కార్మికులకు సంఘీభావంగా గుంటూరు కలెక్టరేట్ ఎదుట... ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ నిరాహార దీక్ష చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన లోకేశ్... ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఇసుక కొరత కారణంగా కార్మికులు పస్తులుంటున్నా... ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక కృత్రిమ కొరత సృష్టించి... వైకాపా నేతలు దోచుకుంటున్నారని లోకేశ్ ఆరోపించారు.

ఇతర రాష్ట్రాల్లో కొరత ఎందుకు లేదు..?

ఇసుక విషయంలో అవినీతి చేశామని... తమపై వైకాపా ఆరోపణలు చేసిన విషయం గుర్తుచేశారు. ఇప్పుడు ఇసుక ఎవరు తింటున్నారో ప్రజలకు తెలుసునని లోకేశ్‌ ఎద్దేవా చేశారు. కొత్త ఇసుక విధానమంటే నల్లబజారులో అమ్ముకోవడమా..? అని ప్రశ్నించారు. వరదల కారణంగా ఇసుక లేదనడం సాకు మాత్రమేనన్న ఆయన... అలాగైతే మిగతా రాష్ట్రాల్లో ఇసుక సమస్య ఎందుకు లేదని నిలదీశారు. చనిపోయిన కార్మికుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికులు తిరగబడితే వైకాపా ప్రభుత్వం ఒక్కరోజు కూడా ఉండదని హెచ్చరించారు.

పాలనంతా రివర్స్ గేర్​లోనే...

కొత్త ఇసుక విధానం పేరుతో విపరీతంగా ధరలు పెంచి... బ్లాక్‌ మార్కెట్‌లో సరఫరా చేసే స్థాయికి దిగజారారని వైకాపా ప్రభుత్వంపై నారా లోకేశ్‌ విమర్శలు గుప్పించారు. ఎప్పుడూ ఈ స్థాయిలో ఇసుక కొరత లేదన్న ఆయన... గుంటూరు జిల్లాలో కార్మికుల ఆత్మహత్యలకు ప్రభుత్వానిదే బాధ్యతన్నారు. ఏపీలోని ఇసుక పక్క రాష్ట్రాలకు తరలిపోతుందని ఆరోపించారు. వైకాపా నేతలే ఇసుక తరలిస్తూ... సొమ్ముచేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఈ ప్రభుత్వంలో అన్నీ కోతలేనని ఎద్దేవా చేశారు. ఇసుక, కరెంటు కోతలు... ఇలా సమస్యలు తప్ప సంక్షేమం లేదన్నారు. వైకాపా ప్రభుత్వం సుమారు 50 పథకాలు రద్దు చేసిందన్నారు.

ఇదీ చదవండి : 'బాధితులకు రూ.25 లక్షలు పరిహారం ఇవ్వాలి'

Last Updated : Oct 30, 2019, 7:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.