రమ్య ఘటన మరవకముందే గుంటూరు జిల్లాలో మరో దారుణం చోటు చేసుకోవటం బాధాకరమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. రాజుపాలెంలో దళిత మైనర్ బాలికపై సామూహిక అత్యాచార ఘటన రాష్ట్రంలో ఉన్న ఘోరమైన పరిస్థితులకు అద్దంపడుతోందని ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. ఆడబిడ్డలకు భద్రత కల్పించడంలో జగన్ సర్కార్ పూర్తిగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రతిపక్ష పార్టీల నాయకులను తిట్టడం, కేసులు పెట్టడంపై ఉన్న శ్రద్ధ మహిళలకు రక్షణ కల్పించడంపై పెట్టుంటే ఇలాంటి ఘటనలు పునరావృతమయ్యేవి కావన్నారు. మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
-
రమ్య ఘటన మరవకముందే గుంటూరు జిల్లాలో మరో దారుణం చోటుచేసుకోవడం బాధాకరం. రాజుపాలెంలో దళిత మైనర్ బాలిక పై సామూహిక అత్యాచార ఘటన రాష్ట్రంలో ఉన్న ఘోరమైన పరిస్థితులకు అద్దంపడుతుంది. ఆడబిడ్డలకు భద్రత కల్పించడంలో @ysjagan సర్కార్ పూర్తిగా విఫలమైంది.(1/2)
— Lokesh Nara (@naralokesh) August 19, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">రమ్య ఘటన మరవకముందే గుంటూరు జిల్లాలో మరో దారుణం చోటుచేసుకోవడం బాధాకరం. రాజుపాలెంలో దళిత మైనర్ బాలిక పై సామూహిక అత్యాచార ఘటన రాష్ట్రంలో ఉన్న ఘోరమైన పరిస్థితులకు అద్దంపడుతుంది. ఆడబిడ్డలకు భద్రత కల్పించడంలో @ysjagan సర్కార్ పూర్తిగా విఫలమైంది.(1/2)
— Lokesh Nara (@naralokesh) August 19, 2021రమ్య ఘటన మరవకముందే గుంటూరు జిల్లాలో మరో దారుణం చోటుచేసుకోవడం బాధాకరం. రాజుపాలెంలో దళిత మైనర్ బాలిక పై సామూహిక అత్యాచార ఘటన రాష్ట్రంలో ఉన్న ఘోరమైన పరిస్థితులకు అద్దంపడుతుంది. ఆడబిడ్డలకు భద్రత కల్పించడంలో @ysjagan సర్కార్ పూర్తిగా విఫలమైంది.(1/2)
— Lokesh Nara (@naralokesh) August 19, 2021
కబుర్ల కాలక్షేపం ఆపండి
'వారం రోజుల్లో పోలీసు దర్యాప్తు, 14 రోజుల్లో న్యాయ ప్రక్రియ పూర్తి, 21 రోజుల్లోపే దోషికి ఉరి శిక్ష' అన్న జగన్ దిశ చట్టం ఎక్కడా అని నారా లోకేశ్ ప్రశ్నించారు. వైకాపా రెండేళ్ల పాలనలో 500 మంది ఆడబిడ్డలపై అఘాయిత్యాలు జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు వరకూ ఏ ఒక్కరికి కూడా శిక్ష పడింది లేదని ఆక్షేపించారు. ఇప్పటికైనా కబుర్ల కాలక్షేపం ఆపి రమ్యని కిరాతకంగా నడి రోడ్డుపై పొడిచి చంపిన మృగాడిని శిక్షించాలని డిమాండ్ చేశారు. హంతకుడికి శిక్ష పడేందుకు ఇంకా 17 రోజులు మాత్రమే మిగిలాయని లోకేశ్ గుర్తు చేశారు.
-
ఇప్పటికైనా కబుర్ల కాలక్షేపం ఆపి రమ్యని కిరాతకంగా నడి రోడ్డుపై పొడిచి చంపిన మృగాడిని శిక్షించండి.ఇక 17 రోజులు మాత్రమే మిగిలాయి.(2/2)#JusticeForRamya
— Lokesh Nara (@naralokesh) August 19, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">ఇప్పటికైనా కబుర్ల కాలక్షేపం ఆపి రమ్యని కిరాతకంగా నడి రోడ్డుపై పొడిచి చంపిన మృగాడిని శిక్షించండి.ఇక 17 రోజులు మాత్రమే మిగిలాయి.(2/2)#JusticeForRamya
— Lokesh Nara (@naralokesh) August 19, 2021ఇప్పటికైనా కబుర్ల కాలక్షేపం ఆపి రమ్యని కిరాతకంగా నడి రోడ్డుపై పొడిచి చంపిన మృగాడిని శిక్షించండి.ఇక 17 రోజులు మాత్రమే మిగిలాయి.(2/2)#JusticeForRamya
— Lokesh Nara (@naralokesh) August 19, 2021
ఇదీ చదవండి
Ramya Murder case : 'ప్రేమించాలంటూ వేధించాడు... కాదన్నందుకు కడతేర్చాడు'