గుంటూరు జిల్లాలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. కరోనా తీవ్రత దృష్ట్యా నగరంలో కంటైన్మెంట్ జోన్లను 10కి పెంచారు. గుంటూరు పట్టణంలో లాక్డౌన్ నిబంధనలు కఠినతరం చేస్తున్నట్లు కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ ప్రకటించారు. ప్రభుత్వోద్యోగులు ఉదయం 10 గంటల్లోపు కార్యాలయాలకు చేరుకోవాలని... సాయంత్రం 5 గంటల లోపు ఎక్కడా రహదారులపై సంచరించరాదని కలెక్టర్ ఆదేశాలు జారీచేశారు. ఉదయం 9 గంటలోపు కూరగాయలు, నిత్యావసర వస్తువుల కోసం ఒక్కరే రావాలని సూచించారు. బయటకు వచ్చేటప్పుడు తప్పనిసరిగా మాస్కు ధరించాలని...లేకుంటే వెయ్యి రూపాయల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. జిల్లాలో ఇప్పటివరకు 1,001 నమూనాలను సేకరించి పరీక్షలకు పంపగా...615 ఫలితాలు నెగెటివ్‌గా వచ్చాయి. 51 ఫలితాలు పాజిటివ్‌గా నిర్ధరణ కాగా...మరో 334 ఫలితాలు రావాల్సి ఉంది. ప్రస్తుతం ఆసుపత్రి ఐసోలేషన్‌లో 98 మంది ఉండగా...హోం క్వారంటైన్లో 838 మంది విదేశాల నుంచి వచ్చినవారున్నారని అధికారులు వెల్లడించారు.
ఇదీచదవండి