ETV Bharat / state

క్వారీ నుంచి ఇసుక రవాణా.. అడ్డుకున్న ముఠా కూలీలు - జువ్వలపాలెం క్వారీ వద్ద నిలిచిన ఇసుక రవాణా

యంత్రాలు వాడకంతో తమకు ఉపాధి లేకుండా పోయిందని ముఠా కూలీలు ఆందోళన నిర్వహించారు. గుంటూరు జిల్లా కొల్లూరు మండలం జువ్వలపాలెం క్వారీ నుంచి ఇసుక రవాణా చేసే లారీలను అడ్డుకున్నారు. జేసీబీలతో ఇసుక లోడింగ్​ వల్ల తమ ఉపాధికి గండి పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

sand workers protesting at juvvalapalem quarry
జువ్వలపాలెం క్వారీ నుంచి ఇసుక రవాణా అడ్డుకున్న ముఠా కూలీలు
author img

By

Published : Mar 17, 2021, 5:30 PM IST

కూలీలు అడ్డుకున్న ఇసుక లారీలు

గుంటూరు జిల్లా కొల్లూరు మండలం జువ్వలపాలెం క్వారీలో ఇసుక రవాణా నిలిచిపోయింది. అక్కడ పనిచేసే ముఠా కూలీలు ఇసుక రవాణాను అడ్డుకున్నారు. జేసీబీలతో లోడింగ్ చేయడం వల్ల తమకు ఉపాధి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక తీసుకెళ్లే లారీలకు ట్రాక్టర్ అడ్డు పెట్టి ఆందోళనకు దిగారు.

గతంలో ఇసుక క్వారీల్లో పనిచేసుకునేవాళ్లమని కూలీలు గుర్తు చేశారు. ఇపుడు యంత్రాలు రాకతో తమకు ఉపాధి కరువైందన్నారు. ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరపడంతో.. మంచినీటి సమస్య ఏర్పడిందని చెబుతున్నారు. ఈ విషయంలో అధికారులు జోక్యం చేసుకుని న్యాయం చేయాలని కోరారు.

ఇదీ చదవండి:

గుంటూరు మేయర్ ఎన్నికకు సర్వం సిద్ధం..

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.