ఉండవల్లి కరకట్ట వద్ద చంద్రబాబు అద్దెకు ఉంటున్న నివాసాన్ని వారంలో తొలగించాలంటూ సీఆర్డీఏ ఇవాళ నోటీసులు జారీ చేసింది. లేకుంటే తామే తొలగిస్తామంటూ ఆ నోటీసుల్లో స్పష్టం చేశారు. చంద్రబాబు ఉంటున్న భవనం బయట భద్రతా చెక్‌పోస్టుకు ఈ మేరకు నోటీసులను అంటించారు. సీఆర్డీఏ కమిషనర్‌కు భవన యజమాని నుంచి అందిన వివరణ సంతృప్తికరంగా లేనందున వారం రోజుల్లోగా నిర్మాణాలను తొలగించాలని నోటీసుల్లో తేల్చి చెప్పారు. ఈ వ్యవహారంపై భవన యజమాని లింగమనేని రమేశ్ స్పందించారు. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్‌ఫ్లోర్, స్విమ్మింగ్ పూల్, ఫస్ట్‌ఫ్లోర్‌లోని డ్రెసింగ్ రూమ్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారన్న సీఆర్డీఏ వాదనను ఆయన తప్పుబట్టారు. ఇంటి నిర్మాణ సమయానికి సీఆర్డీఏ లేదని రమేశ్ పేర్కొన్నారు. అప్పట్లో ఉండవల్లి పంచాయతీ అనుమతి తీసుకుని ఇంటిని నిర్మించామని తెలిపారు. స్విమ్మింగ్‌పూల్‌కి రివర్ కన్సర్వేటర్ అనుమతి ఉందని లింగమనేని రమేశ్ వెల్లడించారు.
ఇదీ చదవండి