పర్యావరణానికి హాని కలగకుండా దీపావళిని జరుపుకోవాలని గుంటూరు నగర కమిషనర్ చల్లా అనురాధ కోరారు. నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో "గ్రీన్ దీపావళి" పోస్టర్ని ఆవిష్కరించారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఉత్తర్వుల మేరకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా గ్రీన్ క్రాకర్స్ మాత్రమే వినియోగించాలని తెలిపారు. స్వీట్స్ పంచుకుని సంతోషాన్ని పంచుకోవాలన్నారు.
ప్రమాదకర రసాయనాలతో తయారు చేసిన టపాసులు పేల్చడం వల్ల పర్యావరణ, ధ్వని కాలుష్యంతో ఏర్పడుతుందని వివరించారు. కరోనా బారిన పడిన వారికి ఆరోగ్యం మరింతగా దెబ్బతినే ప్రమాదం ఉందని అన్నారు. టపాసులు కాల్చే సమయంలో శానిటైజర్‌ని ఉపయోగించకూడాదని, అవసరం అయితే సబ్బు నీళ్ళు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.