ETV Bharat / state

కొన్నేళ్లుగా అడిగొప్పలలో మూలన పడిన లెదర్‌ పార్కు

మా ప్రభుత్వం ఎక్కువ మందికి యువతకు ఉపాధి కల్పిస్తోంది.. వారికి నైపుణ్య శిక్షణ ఇచ్చి వివిధ రంగాల్లో స్వయం ఉపాధి పొందేలా చూస్తున్నామని సీఎం నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు తరచూ సమావేశాల్లో చెబుతున్న మాటలివి..! ఐతే క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. కొన్ని చోట్ల నిరుపయోగంగా ఉన్న శిక్షణ కేంద్రాలను సక్రమంగా నడిపస్తే వేలాది మందికి ఉపాధి లభిస్తుందని ప్రజలు కోరుతున్నారు.

Leather Park, which has been in the corner for a few years
కొన్నేళ్లుగా అడిగొప్పలలో మూలన పడిన లెదర్‌ పార్కు
author img

By

Published : Dec 6, 2020, 4:37 PM IST

గుంటూరు జిల్లా దుర్గి మండలం అడిగొప్పల వద్ద... కొన్నేళ క్రితం కోట్లాది రూపాయలతో నిర్మించిన మినీ లెదర్‌పార్కు చాలా కాలంగా మూలనపడి ఉంది. గతంలో ఉద్యానశాఖకు చెందిన 30 ఎకరాలను రెవెన్యూ అధికారులు ఎస్సీ కార్పొరేషన్‌కు అందజేసి లెదర్‌పార్కు కోసం ఇచ్చారు. ఇటీవల ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా 15 ఎకరాల భూమిని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకొని పేదలకు ఇళ్లస్థలాల కోసం కేటాయించింది. ప్రస్తుతం మలుపు శిక్షణ కేంద్రం స్థలం సగానికి కుచించుకుపోయింది.

ఆరువేల మందికి ఉపాధి దిశగా..

అడిగొప్పల సమీపంలో 2003లో రూ.20 లక్షలతో మలుపు శిక్షణ కేంద్రం ఏర్పాటుకు అప్పటి మంత్రి కోడెల శివప్రసాదరావు శంకుస్థాపన చేశారు. 2004న యుద్ధప్రాతిపదికన నిధులు మంజూరు చేసి భవనాలు నిర్మించి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. తరువాత పరిణామాల నేపథ్యంలో ప్రజాప్రతినిధుల, అధికారుల నిర్లక్ష్యంతో ప్రభుత్వ లక్ష్యం మూడునెలలకే మూతపడింది. అనంతరం కాంగ్రెస్‌, తెదేపా ప్రభుత్వాలు అధికారంలో వచ్చాయి. యువత పలుమార్లు దీనిపై ఆందోళన చేసినా ఎవరూ పటించుకోలేదు. దశాబ్దం క్రితం దాకా పల్నాడు ప్రాంతంలో మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఉండేది.

స్థానిక యువత అటువైపు ఆకర్షితులవుతున్నారని అప్పటి తెదేపా ప్రభుత్వం అడిగొప్పల సమీపంలో ఆరు వేల మంది యువతకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చేలా ప్రాజెక్టు రూపొందించారు. ప్రారంభంలో యువతకు శిక్షణ కాలంలో కొంత నగదును గౌరవ వేతనం ఇస్తామని, శిక్షణ కాలంలో ఎవరు తయారు చేసిన వస్తువులను వారు మార్కెట్లో విక్రయించుకోవచ్చని, ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా రుణ సౌకర్యం కల్పిస్తానని చెప్పిన హామీలు కార్యరూపం దాల్చకపోవడంతో మలుపు శిక్షణ కేంద్రం మూలనపడింది. కొన్నేళ్లుగా మలుపు శిక్షణ కేంద్రం ముళ్లపొదల్లో మూలనపడి కాపలాదారుడికే మాత్రమే పరిమితమైంది. ప్రారంభంలో శిక్షణ కోసం యువత ముందుకొచ్చారు. మూడు నెలల్లో 150 మంది చర్మకారులకు తోలు వస్తువుల తయారీలో శిక్షణ ఇచ్చారు. వారికి రుణ సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోవంతో వారి ఉపాధి అవకాశాలపై ప్రభావం చూపింది.

క్లస్టరు విధానానికి ప్రతిపాదనలు

2012లో అప్పటి యూపీఏ ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో కొన్ని లెదర్‌ పార్కులను అభివృద్ధి చేసేందుకు అప్పటి ప్రభుత్వం ఒక్కో కేంద్రానికి రూ.12 కోట్లు నిధులు కేటాయించింది. క్లస్టరు విధానంలో అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. అందులో అడిగొప్పల లెదర్‌పార్కు ఉంది. నిధులు మంజూరైతే అడిగొప్పల లెదర్‌ పార్కులోనే ముడిపదార్ధాల నుంచి ఉత్పత్తుల దాకా దారం, సోల్‌, పాదరక్షలు, బూట్లు, లెదర్‌బ్యాగ్‌ల తయారీ పరిశ్రమలు క్రమంగా నెలకొల్పాలని భావించినా ఆరంభశూరత్వంగామారింది. అడిగొప్పల మలుపు కేంద్రం దుస్థితిని నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, ప్రభుత్వ విప్‌ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సత్వరం స్పందించి సీఎం జగన్‌ దృష్టికి తీసుకెళ్లి పల్నాడులోని యువతకు ఉపాధి మార్గాలకు బాటలు వేయాలని ప్రజలు కోరుతున్నారు.

ఇదీ చదవండి:

సమీపిస్తున్నతుది గడువు...కిట్లను వదిలించుకోవడమే లక్ష్యంగా పరీక్షలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.