అమరావతి ప్రాంతంపై అభిమానం ఉంటే గుంటూరు, కృష్ణా జిల్లాల ప్రజాప్రతినిధులు తమ పదవులకు రాజీనామా చేయాలని తెదేపా ఎమ్మెల్సీ బీటెక్ రవి డిమాండ్ చేశారు. పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను గవర్నర్ ఆమోదించడాన్ని నిరసిస్తూ ఇప్పటికే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన ఆయన... సోమవారం తుళ్లూరులో రాజధాని రైతులు, మహిళలు నిర్వహిస్తున్న ధర్నా శిబిరానికి బీటెక్ రవి వచ్చి సంఘీభావం తెలిపారు.
కేవలం వ్యక్తిగత ప్రయోజనాల కోసమే మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారని బీటెక్ రవి విమర్శించారు. హైకోర్టును ప్రకటించడం వల్ల రాయలసీమ ప్రాంతానికి ఒరిగేదేమీ లేదని అభిప్రాయపడ్డారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులను వంచించారని.. వారికి మద్ధతుగా న్యాయపోరాటం చేస్తామని బీటెక్ రవి చెప్పారు.
ఇదీ చదవండి