రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం అమరావతికి వచ్చి రెండేళ్లు పూర్తైన సందర్భంగా న్యాయవాదులు ప్లకార్డులు ప్రదర్శించారు. ఏపీ హైకోర్టు సాధన పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో న్యాయవాదులు ప్లకార్డులు చేపట్టారు. ఈ రెండేళ్ల కాలంలో హైకోర్టు ఎన్నో సంచలమైన తీర్పులను వెలువరించిందని న్యాయవాదులు చెప్పారు. రెండేళ్ల సమయం చాలా తొందరగా గడిచిందని న్యాయవాదులు అన్నారు. హైకోర్టు సాధన కోసం చేసిన పోరాటాలను న్యాయవాదులు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
గురువారం సాయంత్రం పదవీ విరమణ చేస్తున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాకేష్ కుమార్కు న్యాయవాదులు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఇదీ చదవండి: తహసీల్దార్ కార్యాలయానికి తాళం వేసిన మహిళా రైతు