విజయవాడ క్లబ్లో వసతి కల్పించినప్పటికీ వలస కార్మికులు స్వస్థలాలకు వెళ్లిపోతుండటంతో పోలీసులు కన్నెర్ర జేశారు. విజయవాడ నుంచి గుంటూరు జిల్లా తాడేపల్లికి చేరుకున్న వలస కార్మికులపై లాఠీఛార్జ్ చేశారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఆదేశాల మేరకు వలస కూలీలను విజయవాడ క్లబ్‌కు తరలించారు. అయితే, వారికి అల్పాహారం అందజేసే క్రమంలో కూలీలంతా స్వస్థలాలకు వెళ్లేందుకు సైకిళ్లపై బయలుదేరారు. అక్కడ నుంచి గుంటూరు జిల్లా తాడేపల్లి వారధి వద్దకు చేరుకున్న వారిని పోలీసులు అడ్డగించి లాఠీలతో విచక్షణారహితంగా కొట్టటంతో భయంతో పరుగులు తీశారు.
ఇదీ చదవండి: వలస కూలీల తరలింపునకు ప్రత్యేక రైలు