Land prices largely increased in Amravati: రాజధాని అమరావతిలో భూముల కొనుగోళ్లలో మళ్లీ కదలిక కనిపిస్తోంది. రైతులకు ఇచ్చిన ప్లాట్లను కొనుగోలు చేసేందుకు రియల్టర్లు, కొనుగోలుదారులు ఆసక్తి చూపుతున్నారు. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాలతో, అమరావతిపై ప్రజల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. దీని వల్లే అక్కడ భూముల ధరలు పెరుగుతున్నాయి. ఈ పరిణామాలను రైతులు స్వాగతిస్తున్నారు.
'మూడు రాజధానుల నిర్ణయం మూర్ఖత్వమే' - అమరావతినే కొనసాగించాలని కొవ్వొత్తుల ర్యాలీ
భరోసా రావడంతోనే ధరలకు రెక్కలు: అమరావతిలో కొద్దిరోజులుగా ప్లాట్ల ధరల్లో కదలిక వచ్చింది. క్రమంగా ధరలు పెరుగుతున్నాయి. ప్లాట్ల కొనుగోలుకు కొత్త వ్యక్తులు వచ్చి, రేట్లను ఆరా తీస్తున్నారు. ఈ పరిణామం రైతులకు ఊరటనిస్తోంది. పాలకులు ఎన్ని ఆటంకాలు సృష్టించినా రాష్ట్రానికి అమరావతే రాజధానిగా ఉంటుందన్న భరోసా రావడంతోనే ధరలు పెరుగుతున్నాయని రైతులు చెబుతున్నారు. వైసీపీ సర్కార్‌పట్ల ప్రజల్లో ఉన్న భ్రమలు తొలగిపోతున్నాయన్న స్థానికులు, రైతులు, రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన ప్రభుత్వం వస్తుందన్న ధీమాతోనే కొనుగోలుదారులు రాజధాని బాట పట్టారని చెబుతున్నారు.
జగన్ పనైపోయింది - స్వయంగా వైసీపీ నేతలే చెబుతున్నారు: నారా లోకేశ్
3 రాజధానుల నిర్ణయంతో అమరావతికి ఆటంకాలు: గత ప్రభుత్వంలో పగలు రాత్రి తేడా లేకుండా రాజధాని నిర్మాణ పనులు జరిగాయి. వేల మంది కార్మికులకు ఉపాధి దొరికింది. పెద్ద పెద్ద కంపెనీలు తమ కార్యాలయాలను రాజధానిలో పెట్టేందుకు ముందుకు వచ్చాయి. అప్పుడు రాజధానిలో రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్లకు మంచి డిమాండ్ ఉండేది. వైసీపీ వచ్చాక 3 రాజధానుల నిర్ణయంతో అమరావతికి ఆటంకాలు ఏర్పడ్డాయి. నాలుగున్నరేళ్లుగా అభివృద్ధి జాడ లేక పోగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా రాజధానిని తయారు చేశారు. ఈనెల మొదట్లో తెలంగాణ ఎన్నికల ఫలితాలతో రాష్ట్రంలోనూ పరిస్థితులు మారాయని, వైసీపీ ప్రభుత్వం తప్పకుండా మారుతుందని, అమరావతి మళ్లీ పట్టాలెక్కుతుందని ఆశాభావంతో ఉన్నట్లు రైతులు చెబుతున్నారు.
చంద్రబాబు సీఎం అవుతారనే నమ్మకంతో: 3 నెలల కిందటి వరకూ రాజధాని గ్రామాల్లో ప్లాట్లు కొనుగోలుకు పెద్దగా ఎవరూ ఆసక్తి చూపేవారు కాదన్న రైతులు, అడపా దడపా ఒకరిద్దరు వచ్చి వెళ్లేవారని అంటున్నారు. ప్రస్తుతం రాజధాని గ్రామాలకు నిత్యం పదుల సంఖ్యలో వచ్చి ధరలు ఆరా తీసి వెళ్తున్నారని, రైతులకు ఇచ్చిన నివాస ప్లాట్ల ధరలు గతంలో కన్నా గజానికి 5వేల వరకు పెరిగాయని, వాణిజ్య ప్లాట్ల ధరలు గజానికి 10వేల వరకు అధికమయ్యాయని తెలిపారు. జాతీయ రహదారి పక్కన ఉన్న స్థలాల రేట్లు భారీగానే పలుకుతున్నాయని, చంద్రబాబు సీఎం అవుతారనే నమ్మకమే ప్రస్తుత పరిణామాలకు కారణమని రైతులు చెబుతున్నారు. రాజధానిలో వైసీపీ నాయకులు కూడా పెద్ద ఎత్తున ప్లాట్లు కొనుగోలు చేస్తున్నారు. హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు సైతం ఇక్కడ ప్లాట్లపై ఆసక్తి చూపుతున్నారు.
రాజధానిగా అమరావతే- 3నెలల్లో జగన్ చేసిన తప్పులన్నీ సరిచేస్తా: చంద్రబాబు