నరసరావుపేట మండలం కాకాని గ్రామం వద్ద నూతనంగా నిర్మించనున్న జేఎన్టీయూ కళాశాల భవనానికి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ఛైర్మన్ కె.హేమచంద్రారెడ్డి పాల్గొన్నారు. విద్యార్థిని, విద్యార్థులకు వేర్వేరుగా వసతి గృహాలు ఉంటాయని చెప్పారు. అధునాతన రీతిలో తరగతి గదులు నిర్మిస్తారన్నారు. కళాశాల ప్రాంగణంలోని ఐదెకరాల్లో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
ముఖ్యమంత్రి ఆదేశాలతో నరసారావుపేటలో జేఎన్టీయూ కళాశాల నిర్మాణం అధునాతన రీతిలో చేపట్టటం సంతోషంగా ఉందన్నారు. ఫ్యాకల్టీని ఏర్పాటు చేసి.. నాణ్యతతో కూడిన విద్యను అందించాలన్నారు. మిగతా ఇంజనీరింగ్ కళాశాలకు ధీటుగా జేఎన్టీయూ కాలేజీని నడపాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాలేజీ ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చదవండి: ఘరానా దొంగలను పట్టుకున్న పోలీసులు