ETV Bharat / state

పట్టని పాఠశాలల నిర్వహణ... కొరత పేరుతో కోతలు - ఏపీ తాజా వార్తలు

ప్రభుత్వ పాఠశాలలకు ఇచ్చే నిర్వహణ నిధుల్లో పాఠశాల విద్యాశాఖ కోతలు విధిస్తోంది. నిధుల కొరత పేరుతో ఈ ఏడాది ఇప్పటి వరకు 20 శాతమే విడుదల చేసింది. కేంద్రం తన వాటాగా ఇస్తున్న 60శాతం నిధుల్లోనూ రాష్ట్ర స్థాయిలో కోతలు విధిస్తున్నారు. చాక్‌పీసులు, రిజిస్టర్ల కొనుగోలు, విద్యుత్తు బిల్లుల చెల్లింపులకు ప్రధానోపాధ్యాయులు తమ జేబుల్లోంచి ఖర్చు చేయాల్సి వస్తోంది. ఖాతాలకు జమైతే బిల్లులు పెట్టుకుందామనుకుంటున్నా వారికి నిరాశే మిగులుతోంది.

NO FUNDS
నిధుల కొరత
author img

By

Published : Oct 31, 2022, 8:51 AM IST

నిధుల కొరత

విద్యార్థుల సంఖ్య ఆధారంగా గతంలో ఒకేసారి పాఠశాలలకు నిర్వహణ నిధులు విడుదల చేసేవారు. ఈ ఏడాది విడతల వారీగా ఇస్తున్నారు. వాటిలోనూ కోతలు విధిస్తున్నారు. కొన్ని పాఠశాలలకు 2020-21, 2021-22 విద్యా సంవత్సరాలకు సంబంధించి సరిగా ఇవ్వలేదు. ఇచ్చిన వాటి నుంచి విద్యా సంవత్సరం ముగింపులో మిగిలిన మొత్తాలను వెనక్కి తీసేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 37 వేల 729 ప్రాథమిక పాఠశాలలు, 7 వేల 73 ఉన్నత పాఠశాలలకు కలిపి ఈ ఏడాది ర135 కోట్ల 35 లక్షల రూపాయలు ఇవ్వాల్సి ఉండగా.. మొదటి విడతగా కేవలం 20.07 కోట్లు మాత్రమే విడుదల చేస్తూ... ఆగస్టు 29న ఉత్తర్వులు ఇచ్చారు.

కానీ ఇంతవరకు చాలా పాఠశాలలకు ఆ నిధులు జమ కాలేదు. జిల్లాల్లోని అదనపు ప్రాజెక్టు సమన్వయ అధికారులకు మొత్తాలను పంపించామని ఉన్నతాధికారులు చెబుతున్నారు. కొన్నిచోట్ల రాలేదని ఏపీసీలు సమాధానమిస్తున్నారు. విడతలవారీగా అంటూ కోతలు విధించడంపై ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జాప్యం జరిగితే చివరికి మొత్తం నిధులు విడుదలయ్యే పరిస్థితి ఉండదని ఉపాధ్యాయ సంఘాలు వెల్లడిస్తున్నాయి.

పాఠశాలలకు ఏటా 60 కోట్లకుపైగా విద్యుత్తు బిల్లులు వస్తున్నాయి. మీటర్లు కేటగిరి-2లో ఉన్నందున బిల్లు మొత్తాలు అధికంగానే వస్తున్నాయి. వెయ్యి మందికి పైగా విద్యార్థులు ఉన్న పాఠశాలకు ఏడాదికి కేవలం లక్ష ఇస్తున్నారు. ఇందులోనూ 10శాతం నీరు, పారిశుద్ధ్యం, పరిశుభ్రత, స్వచ్ఛత కార్యాచరణ కోసం వ్యయం చేయాలనే నిబంధన విధిస్తున్నారు. దీని వల్ల విద్యుత్తు బిల్లుల చెల్లింపులకు ఇబ్బందులు పడాల్సి వస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.