ETV Bharat / state

తెలంగాణ శాసనసభలో వాడీవే'ఢీ' చర్చ - రేవంత్​ రెడ్డి వర్సెస్​ కేటీఆర్ - ap news

KTR vs Revanth Reddy in Assembly : తెలంగాణ శాసనసభ సమావేశాల్లో రేవంత్​ రెడ్డి, కేటీఆర్​ మధ్య వాడీవే'ఢీ' చర్చ జరిగింది. ఇందిరమ్మ పాలన గురించి చెబుతామని కాంగ్రెస్‌ సభ్యులు మిడిసిపడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. దీనిపై రేవంత్‌రెడ్డి స్పందిస్తూ కొంతమంది ఎన్‌ఆర్‌ఐలకు ప్రజాస్వామిక స్ఫూర్తి అర్థం అవగాహన కాదని వ్యాఖ్యానించారు.

KTR vs Revanth Reddy in Assembly
KTR vs Revanth Reddy in Assembly
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 16, 2023, 5:33 PM IST

రేవంత్​ రెడ్డి వర్సెస్​ కేటీఆర్ - తెలంగాణ శాసనసభలో వాడీవే'ఢీ' చర్చ

KTR vs Revanth Reddy in Assembly : తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీలో వాడీవే'ఢీ' చర్చ నెలకొంది. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి వర్సెస్ కేటీఆర్ అన్నట్లుగా సాగింది. గవర్నర్‌ ప్రసంగమంతా తప్పుల తడకగా, సత్యదూరంగా ఉందని బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఆరోపించారు. బీఆర్ఎస్‌ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, తాము ప్రజల పక్షమేనని కేటీఆర్ స్పష్టం చేశారు.

KTR Speech in Assembly : ప్రజల తరఫున గొంతు విప్పుతామని కేటీఆర్ (KTR) అన్నారు. గత కాంగ్రెస్‌ పాలనలో ఆత్మహత్యలు, ఆకలి కేకలు ఉన్నాయని, కరెంట్‌ లేదని, మంచినీటి సమస్యలు ఉండేవని ఆరోపించారు. నల్గొండలో ప్లోరైడ్‌ బాధలు, దేవరకొండలో పసిపిల్లల అమ్మకాలు ఉన్నాయని విమర్శించారు. పాతబస్తీలో మైనార్టీ తీరని బాలికల వివాహాలు, మహబూబ్‌నగర్‌లో గంజి కేంద్రాలు ఉన్నాయని చెప్పారు. ఇందిరమ్మ పాలన గురించి కూడా చెబుతామని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

'చంద్రబాబు శిష్యుడు రేవంత్​రెడ్డి' - తెలంగాణ ముఖ్యమంత్రికి శుభాకాంక్షల వెల్లువ

తెలంగాణ రాక ముందు బీడువారిన భూములు ఉండేవని కేటీఆర్ అన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్‌ పాలనను విధ్వంసం అంటే, 50 సంవత్సరాల కాంగ్రెస్‌ పాలనను ఏమనాలని ప్రశ్నించారు. కొత్త ప్రభుత్వానికి 3 నెలల సమయం ఇద్దామని కేసీఆర్‌ చెప్పారని తెలిపారు. పదవుల కోసం పెదాలు మూసిన చరిత్ర కాంగ్రెస్‌దని ఆరోపించారు. హస్తం పార్టీ సభ్యులు మిడిసిపడుతున్నారని కేటీఆర్ విమర్శించారు.

అప్పట్లో చంద్రబాబు, ఇప్పుడు రేవంత్ రెడ్డి! ఇసుకతో బొమ్మలు వేస్తావా ? కళకారుడికి పోలీసుల బెదిరింపులు

మేం చెప్పే ప్రయత్నం చేసినా వారు తెలుసుకోరు : కేటీఆర్‌ వ్యాఖ్యలపై సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) స్పందించారు. కొంతమంది ఎన్‌ఆర్‌ఐలకు ప్రజాస్వామిక స్ఫూర్తి అంటే అర్థం తెలియట్లేదని విమర్శించారు. మనం ప్రయత్నం చేసినా కూడా వారు తెలుసుకోరని అన్నారు. సభ్యుల సంఖ్య ముఖ్యం కాదని, ప్రజాస్వామ్య స్ఫూర్తి ఉండాలని సూచించారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాపై పోరాడింది కాంగ్రెస్‌ నేతలే అని రేవంత్‌రెడ్డి గుర్తుచేశారు.

"గత పాలనలో కేసీఆర్‌కు వివిధ పదవులు ఇచ్చిందే కాంగ్రెస్‌ పార్టీ. ఎమ్మెల్యే కాకుండానే హరీశ్‌రావుకు మంత్రి పదవి ఇచ్చిందే వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి. గతంలో పోతిరెడ్డిపాడు మీద పోరాడిందే పి.జనార్దన్‌రెడ్డి. గత పాలన గురించి చర్చించాలనుకుంటే ఒకరోజు సమయం తీసుకుని చర్చిద్దాం." - రేవంత్‌రెడ్డి, ముఖ్యమంత్రి

అప్పుడు ఒక్క పీజేఆర్‌ తప్ప ఎవరూ మాట్లాడలేదు : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సభను తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నారని హరీశ్ రావు (Harish Rao) కలగజేసుకున్నారు. గతంలో ఆరుగురు మంత్రులు 14 నెలల్లోనే రాజీనామా చేశామని గుర్తు చేశారు. పులిచింతల ఆపకపోవడం వల్లే కేబినెట్‌ నుంచి వైదొలుగుతున్నాం అని రాజీనామా చేసినట్లు తెలిపారు. కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చిన ఘనత బీఆర్ఎస్(టీఆర్ఎస్‌) పార్టీదేనని చెప్పారు. తాము పొత్తుపెట్టుకోవడం వల్లే గతంలో హస్తం పార్టీ అధికారంలోకి వచ్చిందని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు.

రేవంత్‌ అన్నా మీతో మాట్లాడాలి - ఒక్క పిలుపుతో స్పందించి సమస్య పరిష్కరించిన సీఎం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.