ETV Bharat / state

వైభవంగా మల్లన్న కల్యాణోత్సవం.. పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి హరీశ్​రావు - Komuravelli Mallanna jatara 2022

Komuravelli Mallikarjuna Swamy Kalyanam : కొమురవెల్లి మల్లికార్జున స్వామి కల్యాణ మహోత్సవం కన్నులపండువగా జరిగింది. బలిజ మేడలమ్మ, గొల్ల కేతమ్మలను మల్లన్న స్వామి మనువాడారు. కల్యాణ మహోత్సవానికి .. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి హరీశ్​రావు హాజరై స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. మల్లికార్జునుడికి బంగారు కిరీటాన్ని కానుకగా అందించారు.

Komuravelli Mallikarjuna Swamy Kalyanam
అంగరంగ వైభవంగా మల్లన్న కల్యాణోత్సవం
author img

By

Published : Dec 18, 2022, 2:29 PM IST

Komuravelli Mallikarjuna Swamy Kalyanam : సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలో అంగరంగ వైభవంగా మల్లికార్జునస్వామి కల్యాణోత్సవం జరిగింది. బృహన్మఠాధీశుడు సిద్ధగురు మణికంఠ శివాచార్యుల పర్యవేక్షణలో ఈ వేడుకలను నిర్వహించారు. బలిజమేడలమ్మ, గొల్ల కేతమ్మలను మల్లికార్జునుడు మనువాడాడు. కల్యాణోత్సవానికి ప్రభుత్వం తరఫున మంత్రి హరీశ్​రావు పట్టువస్త్రాలు సమర్పించారు. స్వామివారికి బంగారు కిరీటాన్ని కానుకగా అందించారు.

మల్లికార్జునస్వామి కల్యాణానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఆలయ నిర్వాహకులు స్వామి వివాహాన్ని కన్నులపండువగా నిర్వహించారు. స్వామి వారి కల్యాణ వేడుకను మంత్రి హరీశ్​రావుతో పాటు మంత్రులు మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇతర ప్రజాప్రతినిధులు భక్తి పారవశ్యంతో తిలకించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.