గుంటూరు జిల్లా కొల్లిపర రిజిస్ట్రార్ కార్యాలయాన్ని అధికారులు మూసివేశారు. కార్యాలయ సిబ్బందిలో ఒకరికి కరోనా రావటంతో.. మిగతావారు కూడా ఐసోలేషన్‌కు వెళ్లారు. దీంతో కార్యాలయాన్ని మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కార్యాలయంలో పారిశుధ్య చర్యలు చేపట్టి.. సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించిన తర్వాతే కార్యాలయాన్ని తిరిగి తెరుస్తామని వెల్లడించారు. కొల్లిపరలో పాజిటివ్ కేసులు పెరుగుతున్నందున.. అధికారులు ఆంక్షలు విధించారు. దుకాణాలు, వాణిజ్య కార్యకలాపాలు ఉదయం 11 గంటల వరకు మాత్రమే నిర్వహించాలని ఆదేశించారు.
ఇవీ చూడండి...: వృద్ధుడు మృతి.. కొవిడ్ టీకానా? అనారోగ్య సమస్యలా?