గుంటూరు జిల్లా ధరణికోటలో ఇద్దరు వ్యక్తుల కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. కిడ్నాప్‌తో రూ.15 కోట్ల విలువైన భూమిని తమ పేరున రాయించుకున్న ముఠా సభ్యుల ఆటకట్టించారు. ఈ కేసులో బాచీ అనే కానిస్టేబుల్ సహా 12 మంది నిందితులను గుర్తించగా... వీరిలో 9 మందిని అరెస్టు చేశారు. ధరణికోటకు చెందిన రమేశ్ బాబు, అతని మేనమామ హనుమంతరావును కిడ్నాప్ చేశారు. రమేశ్ కుటుంబసభ్యుల్ని బెదిరించారు. తర్వాత ఇద్దరినీ రిజస్ట్రేషన్ ఆఫీస్‌కు తీసుకెళ్లి బలవంతంగా వారి భూమిని రాయించుకున్నారని గుంటూరు గ్రామీణ ఎస్పీ విజయారావు వివరించారు. బాధితుడు రమేశ్... ఎస్పీకి ఫిర్యాదు చేశాకా... కిడ్నాప్, దౌర్జన్యం ఘటన వెలుగులోకి వచ్చింది.
ఇదీ చదవండి :
వ్యక్తిని కిడ్నాప్ చేసి... కోట్లు విలువ చేసే భూమి రాయించుకున్నారు...!