రాష్ట్రంలో మద్యం ధరలు భారీగా పెరగడం, మంచి బ్రాండ్లు లభించకపోవటంతో మందుబాబులు ఇతర రాష్ట్రాల నుంచి మద్యం అక్రమంగా తీసుకువస్తున్నారు. ఇప్పటి వరకు తెలంగాణ నుంచి రాష్ట్రంలోకి మద్యం అక్రమంగా వస్తుండగా.. ఇప్పుడు కేరళ నుంచి కొంతమంది రవాణా చేస్తున్నారు.
తాజాగా గుంటూరులో ఎక్సైజ్ పోలీసులు కేరళ మద్యం స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి ఇద్దరిని అరెస్టు చేశారు. ఈ కేసులో మరికొందరి ప్రమేయం ఉన్నట్లు విచారణలో గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
ఇవీ చదవండి..