KCR Comments in BRS PUBLIC Meeting: తెలంగాణ మోడల్ దేశమంతా అమలు చేస్తామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఖమ్మం బీఆర్ఎస్ ఆవిర్భవ బహిరంగ సభలో ప్రసంగించిన సీఎం కేసీఆర్... బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే దేశమంతా ఉచిత విద్యుత్ అమలు చేస్తామని ప్రకటించారు. నష్టాలు సమాజానికి.. లాభాలు ప్రైవేటు వ్యక్తులకా? అని ప్రశ్నించారు. ఎల్‌ఐసీని అడ్డికి పావుసేరుకు అమ్ముతారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్‌ఐసీ కోసం బీఆర్ఎస్ పోరాడుతుందని తెలిపారు. ఎల్‌ఐసీ ఏజెంట్లు, ఉద్యోగులు బీఆర్ఎస్‌ను బలపరచాలన్నారు.
కరెంటు కార్మికులారా? పిడికిలి బిగించండి. విద్యుత్‌ను ప్రభుత్వ రంగంలోనే ఉంచుతాం. ఇంకా దేశంలో లక్ష కోట్ల మెగావాట్ల జల విద్యుత్‌కు అవకాశం ఉంది. అవసరం ఉన్నచోట వ్యాపారం చేయడం ప్రభుత్వ విధానం. దళితబంధును దేశమంతా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా.. మీరు ఇవ్వకపోతే మేము దేశమంతా దళితబంధు ఇస్తాం.. దేశంలో మతపిచ్చి లేపుతున్నారు. - కేసీఆర్, ముఖ్యమంత్రి
విశాఖ ఉక్కును ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటుపరం కానివ్వమని కేసీఆర్ ధ్వజమెత్తారు. విశాఖ ఉక్కును మోదీ అమ్మితే మేము అధికారంలోకి వచ్చాక కొంటామని అన్నారు. లొడలొడ మాట్లాడే ప్రధానికి మంచి నీళ్లు ఇవ్వడం చేతకాదా? అని విమర్శించారు. మేక్ ఇన్ ఇండియా.. జోక్ ఇన్ ఇండియాగా మారిందని ఎద్దేవా చేశారు. అధికారంలోకి వస్తే అగ్నిపథ్‌ను రద్దు చేస్తామని ప్రకటించారు. కొద్దిరోజుల్లోనే బీఆర్ఎస్ విధానాలు ప్రజల ముందుంచుతామని తెలిపారు. 150 మంది మేధావులు బీఆర్ఎస్ విధానాలు రూపొందిస్తున్నారన్నారు.
దేశంలో చైతన్యం తెచ్చేందుకు పుట్టిందే బీఆర్ఎస్. తెలంగాణ మోడల్ దేశమంతా అమలు చేస్తాం. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే దేశమంతా ఉచిత విద్యుత్. ఎల్‌ఐసీ కోసం బీఆర్ఎస్ పోరాడుతుంది. విద్యుత్‌ను ప్రభుత్వ రంగంలోనే ఉంచుతాం. అవసరం ఉన్నచోట వ్యాపారం చేయడం ప్రభుత్వ విధానం. - కేసీఆర్, ముఖ్యమంత్రి
ఇవీ చూడండి: