గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం పోలిరెడ్డిపాలెం గ్రామంలోని సిద్ధి బుద్ధి విఘ్నేశ్వరాలయంలో కార్తిక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాగంణంలో దీపాలతో శివలింగాకారాన్ని ఏర్పాటు చేశారు. ప్రత్యేక పూజల అనంతరం నిర్వహించిన కోలాటం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.
కార్తిక పౌర్ణమి సందర్భంగా ప్రతి ఏటా గ్రామంలోని విఘ్నేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. నూతన దేవాలయం నిర్మాణం అనంతరం కార్తిక పౌర్ణమి రోజు గ్రామ మహిళలు కోలాటం ఆడతూ శివయ్యను పూజించడం ఆనవాయితిగా మారింది.
ఇదీ చదవండి
వైన్స్‌కు అడ్డురాని కరోనా నిబంధనలు.. మీడియాకు అడ్డువస్తున్నాయా..?