ETV Bharat / state

అమ్మా, నాన్నలను చూపించండి... ప్లీజ్! - galimpu

అమ్మా అని పిలిచినా... ఆలకించవేమమ్మా! పాట విన్నారుగా... సరిగ్గా ఇలాగే గుంటూరులో ఓ యువకుడు 11 ఏళ్ల క్రితం తల్లిదండ్రులకు దూరమయ్యాడు. ఇన్నేళ్లు ఎక్కడెక్కడో పెరిగి గుంటూరు చేరి వారి కోసం వెతుకులాట ప్రారంభించాడు. ఓ యాచకురాలి చేతిలో అపహరణై 17 ఏళ్ల వయస్సులో కన్నవాళ్ల కోసం గాలిస్తున్నాడు. ఎంత వెతికినా ఆచూకీ తెలియక... గుంటూరు అర్బన్ పోలీసులను ఆశ్రయించాడు.

తల్లిదండ్రుల కోసం ఆరాటం
author img

By

Published : Feb 2, 2019, 10:52 PM IST

తల్లిదండ్రుల కోసం ఆరాటం
రైలులో తప్పిపోయి చివరికి 25 ఏళ్ల తర్వాత తల్లిని కలుసుకునే సరూ బ్రైర్లీ గుర్తున్నాడా! ఆస్ట్రేలియాలో పెంచిన తల్లిదండ్రుల సాయంతో భారత్​లోని తన కన్నతల్లి కోసం వెతుకతాడు! సరిగ్గా ఇలాంటి సంఘటనే గుంటూరులో జరిగింది. ఆరేళ్ల వయస్సులో అపహరణైన నాగేంద్రప్రసాద్... 11 ఏళ్లు ఎక్కడెక్కడో పెరిగి 17 ఏళ్ల వయస్సులో కన్నవాళ్ల కోసం వెతుకుతున్నాడు.
undefined
గుంటూరు సమీపంలో ఓ గ్రామానికి చెందిన నాగేంద్రప్రసాద్​ని ఆరేళ్లప్పుడు ఓ మహిళ ఎత్తుకుపోయింది. థియేటర్లో సినిమా చూపించి వేరేవాళ్లకు అమ్మేసింది. వాళ్లు ఇతనితో భిక్షాటన చేయించారు. అక్కడా ఇక్కడా తిరుగుతూ వరంగల్ రైల్వేస్టేషన్‌ చేరాడు. అనాథని తెలుకున్న స్థానికులు ఆ బాలుణ్ని ఎస్సీ వసతి గృహంలో చేర్పించారు. అక్కడే పదో తరగితి పూర్తి చేసిన ఇతన్ని వరంగల్ సేవాసాయి ట్రస్టు అక్కున చేర్చుకుంది. బిఏ వరకు చదివించింది.
ఇన్నేళ్లైనా కన్నవాళ్ల కోసం అన్వేషణ ఆపలేదీ నాగేంద్రప్రసాద్. ఊరుపేరు తెలియదు.. తల్లిదండ్రుల పేర్లు మాత్రం లక్ష్మీదేవి,కొండయ్యగా చెబుతున్నాడు. గ్రామానికి సంబంధించిన చిన్న చిన్న గుర్తులు తెలుపుతున్నాడు. వరంగల్ హాస్టల్​లో చేరేటప్పడు తీసుకున్న పొటోలు చూపించి గుంటూరులో ప్రతి ఒక్కర్నీ అడుగుతున్నాడు.
ఎంతగా గాలిస్తున్నా కన్నవాళ్ల ఆచూకీ తెలియక... గుంటూరు అర్బన్ పోలీసులను ఆశ్రయించాడు. తన తల్లిదండ్రులను చూపించాలని వేడుకుంటున్నాడు. అరుదైన ఈ కేసుని విని ఆశ్చర్యపోయిన పోలీసులు తల్లిదండ్రుల పట్ల అతనికి ఉన్న ప్రేమాభిమానాల్ని చూసి మురిసిపోయారు. అప్పటి అదృశ్య కేసులు, జనాభా, ఓటర్ల జాబితాలను సరిపోల్చుతున్నారు. నాగేంద్రప్రసాద్‌ను తల్లిదండ్రుల చెంతకు చేరుస్తామంటున్నారు ఎస్పీ విజయరావు.

Mumbai, Feb 02 (ANI): In a gravity defying move, many freestyle motocross athletes performed bike stunts at the Red Bull FMX JAM near Gateway of India in Mumbai on Saturday. In an exhilarating show, the event saw athletes taking several rounds of bikes and flipping their bikes in the air. The stunts were performed by many international athletes.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.