KA Paul Comments on Telangana New Secretariat: తెలంగాణ నూతన సచివాలయంలో జరిగిన అగ్ని ప్రమాదంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సచివాలయం చూడడానికి వెళ్తానంటే తనను అడ్డుకున్నారని అన్నారు. అందుకే తాను వద్దన్నానని.. దేవుడు కూడా వద్దని అనుకున్నాడని.. ఈ క్రమంలోనే సచివాలయం కాలిపోయిందని తెలిపారు. తనతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుందని చెప్పారు. దేవుడు కూడా కేసీఆర్‌కి వ్యతిరేకంగా ఉన్నారని పేర్కొన్నారు. దేవుడికి కూడా నచ్చకనే సచివాలయానికి వ్యతిరేకంగా నిలబడ్డారని కేఏ పాల్ వ్యాఖ్యానించారు.
Fire Accident at Telangana New Secretariat : కేసీఆర్ అవినీతి ఎంతో కాలం చెల్లదని కేఏ పాల్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఇప్పటికైనా పశ్చాత్తాపడాలని సూచించారు. అంబేడ్కర్ సచివాలయాన్ని సీఎం పుట్టినరోజు ప్రారంభించడం ఏంటని.. వాస్తు బాగాలేదని సెక్రటేరియట్ కూలగొట్టడం ఏంటని నిలదీశారు. కేసీఆర్ ఈసారి ముఖ్యమంత్రిగా గెలవరని.. అలాంటప్పడు ప్రధాని ఏం అవుతారని ఎద్దేవా చేశారు. అంబేడ్కర్ జయంతి రోజే సచివాలయాన్ని ప్రారంభించాలని డిమాండ్ చేశారు. పేరు ఒకరిది.. పండుగ మరొకరిదా అంటూ కేఏ పాల్ వ్యంగాస్త్రాలు సంధించారు.
మరోవైపు నూతనంగా నిర్మించిన సచివాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ప్రారంభించడాన్ని సవాలు చేస్తూ కేఏ పాల్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. సీఎం తన వ్యక్తిగత ప్రచారం నిమిత్తం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, అందులో భాగంగా ఆయన జన్మదినం సందర్భంగా ఫిబ్రవరి 17న సచివాలయాన్ని ప్రారంభిస్తున్నట్లు అధికారులు ప్రకటించారన్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ జన్మించిన ఏప్రిల్ 14న కాకుండా ముఖ్యమంత్రి పుట్టిన రోజు సందర్భంగా ప్రారంభించడం సరికాదని తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. ఇందులో ప్రతివాదులుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితోపాటు సీఎం కార్యాలయాన్ని చేర్చారు. నంబరు కేటాయింపు నిమిత్తం పరిశీలనలో ఉంది.
"నేను వద్దన్నాను.. దేవుడు వద్దని అనుకున్నాడు. అందుకే సెక్రటేరియట్ కాలిపోయింది. నాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది. దేవుడు కూడా కేసీఆర్‌కి వ్యతిరేకంగా ఉన్నారు. దేవుడికి నచ్చకనే సెక్రటరీయెట్కి వ్యతిరేకంగా నిలబడ్డారు అవినీతి ఎంతో కాలం చెల్లదు. కేసీఆర్ ఇప్పటికైనా పశ్చాత్తాపడాలి. కేసీఆర్ ఈసారి ముఖ్యమంత్రిగానే గెలవలేరు. ప్రధాని ఏం అవుతారు అంబేడ్కర్ జయంతి రోజే సచివాలయాన్ని ప్రారంభించాలి." - కేఏ పాల్, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు
రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న కొత్త సచివాలయంలో ఈరోజు అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మొదటి అంతస్తులో అగ్నిప్రమాదం జరిగి గుమ్మటంపై భారీగా పొగలు కమ్ముకున్నాయి. లోయర్ గ్రౌండ్ ఫ్లోర్‌లో షార్ట్ సర్క్యూట్ జరగడంతోనే అగ్నిప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 11 అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ నెల 17న కొత్త సచివాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించేందుకు నిర్ణయం తీసుకున్నారు.
ఇవీ చదవండి: