ETV Bharat / state

కొలువు పేరిట మోసం.. రూ.లక్షకు పైగా వసూలు - గుంటూరు జిల్లా తాజా వార్తలు

పేదరికంలో పుట్టిన ఆమె చదువు కోసం ఎన్నో సవాళ్లు ఎదుర్కొంది. కష్టించి బీటెక్​లో బంగారు పతకం సాధించింది. ఉద్యోగం చేసి తన కుటుంబానికి అండగా నిలవాలని అటుగా ప్రయత్నించింది. ఈ క్రమంలో ఓ ప్రముఖ కంపెనీలో కొలువు ఇప్పిస్తామని కొందరు వ్యక్తులు నమ్మబలికారు. అటుపై అందినకాడిన దోచుకున్నారు. అసలేం జరిగిందంటే..

job cheating
ఉద్యోగం పేరుతో మోసం
author img

By

Published : Apr 13, 2021, 2:13 PM IST

గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన షాహిదా బీటెక్​లో బంగారు పతకం సాధించింది. ఆమె తల్లి టైలరింగ్ చేస్తూ.. షాహిదాను చదివించింది. మంచి ఉద్యోగం సాధించి కుటుంబ సభ్యులకు అండగా నిలవాలనే ఆశతో.. నౌకరీడాట్​ కామ్​లో తన బయోడేటా నమోదు చేసుకున్నారు. కొద్ది రోజులకు మీ వివరాలు చూశామని విప్రో కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం ఇప్పిస్తాం అని కొందరు ఫోన్లో మాట్లాడి నమ్మించారు. దరఖాస్తు రుసుం 1800 రూపాయలు, రిజిస్ట్రేషన్ ఫీజు 4,500 రూపాయలు ఆన్ లైన్లో కట్టించుకున్నారు.

కరోనా కారణంగా ఆన్​లైన్​లో ఇంటర్వ్యూ అంటూ మాట్లాడారు. అనంతరం ఎంపికయ్యారంటూ.. ఉద్యోగ నియామక ధ్రువపత్రం పంపించారు. వివిధ రకాల ఛార్జీల పేరుతో లక్ష రూపాయలు కట్టించుకున్నారు. గుర్తింపు కార్డులకు ఇతర ఖర్చులంటూ ఇంకా నగదు పంపించాలని డిమాండ్ చేయడంతో ఆమెకు అనుమానం వచ్చింది. విచారిస్తే నకిలీ ఉద్యోగ ఎంపిక ధ్రువపత్రంగా తేలింది. దీంతో షాహిదా పోలీసులను ఆశ్రయించింది తనకు న్యాయం చేయాలని కోరింది.

ఇదీ చదవండి:

సముద్రంలో చేపల వేటపై నిషేదం.. ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.