ETV Bharat / state

ప్రభుత్వ ఉద్యోగమన్నాడు.. ఐదు లక్షలు కాజేశాడు - గుంటూరులో ఉద్యోగం ఇప్పిస్తానని మోసం

మున్సిపల్ కార్యాలయంలో ఉద్యోగమన్నాడు. మాయమాటలతో నమ్మించాడు. ఐదు లక్షల రూపాయలను దోచేశాడు. నిలదీస్తే వాయిదాల పేరుతో కాలం వెళ్లదీస్తూ వచ్చాడు. తీరా మోసం పోయామని గ్రహించిన ఆ బాధిత కుటుంబం గుంటూరు పోలీసులను ఆశ్రయించింది. తమ సోమ్మును తిరిగి అప్పగించేలా చూడాలని..నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరింది.

job cheating
ఉద్యోగం ఇప్పిస్తానని 5 లక్షలు దోచుకున్నాడు
author img

By

Published : Mar 1, 2021, 9:16 PM IST

గుంటూరు భవానిపురానికి చెందిన ఏసుదీయమ్మ అనే మహిళకు ముగ్గురు సంతానం. కొంత కాలం క్రితం భర్త చనిపోయాడు. కూలీ పని చేసుకుంటున్న ఇద్దరు పిల్లలకు పెళ్లి చేసి... మూడో కొడుకు కమల్ ని బీటెక్ చదివించింది. కమల్ కు ఉద్యోగం లేకపోవడంతో తెలిసినవారిని సంప్రదించింది. ఇంటి సమీపంలో ఉంటున్న అన్నదాసుల రామచంద్రరావు అనే వ్యక్తి.. తాను 10 ఏళ్లుగా గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో పనిచేస్తున్నానని.. చాలామందికి ఉద్యోగాలు ఇప్పించినట్లు నమ్మబలికాడు. 5 లక్షలు ఇస్తే వారం రోజుల్లో కమల్ కి కూడా జీఎంసీలో శానిటరీ వర్క్ ఇన్స్పెక్టర్ గా ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పాడు.

కొడుకు ఉద్యోగం కోసం తనకు ఆధారమైన ఇంటిని అమ్మేసి మిగిలిన డబ్బులు అప్పు తెచ్చి... 5 లక్షలు రామచంద్రరావుకి ఇచ్చింది. రోజులు గడుస్తున్నా రామచంద్రరావు ఉద్యోగం గురించి.. వాయిదా వేస్తూ వచ్చాడు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు.. గుంటూరు అర్బన్ ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యాలయంలో గత ఏడాది 2019 లో ఫిర్యాదు చేశారు. అయినప్పటి తనకు న్యాయం జరగలేదని తెలిపింది. అనంతరం కొవిడ్ కారణంగా తాను పొలీస్ స్టేషన్ కి రాలేకపోయినట్లు దియ్యమ్మ చెప్పింది. ఈ మధ్య కాలంలో పెద్దల సమక్షంలో మాట్లాడితే... కేసులు వద్దని, 5 లక్షలకు ప్రామిసరీ నోటు, రెండు ఖాళీ చెక్కులను రామచంద్రరావు ఇచ్చాడని తెలిపింది. అనంతరం డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగితే.. ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. తాము ఇచ్చిన 5 లక్షలను ఇప్పించాలని, నిందితుడు రామచంద్రరావుని కఠినంగా శిక్షించాలని బాధితురాలు విన్నవించింది.

ఇదీ చదవండీ..

తెలంగాణ: లాయర్​ దంపతుల హత్య కేసులో కత్తులు లభ్యం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.