వరద సహాయ కార్యక్రమాలు చేపట్టడం, రైతులకు భరోసా ఇవ్వడంలో అధికార యంత్రాంగం విఫలమైందని జనసేన నేతలు ఆరోపించారు. గుంటూరు జిల్లా కృష్ణా పశ్చిమ డెల్టా లంక గ్రామాల్లో పార్టీ నేతలు నాదెండ్ల మనోహర్, బోనబోయిన శ్రీనివాస యాదవ్... పర్యటించారు. ముంపు గ్రామాల్లో పరిస్థితిని పరిశీలించారు. పంటలు దెబ్బతిన్న రైతులను ఓదార్చారు. పెట్టుబడి మొత్తాన్ని రైతులకు పరిహారంగా చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో రైతన్నకు కనీస భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉందన్నారు. గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయాలతో ప్రజల వద్దకు ప్రభుత్వమంటూ చేస్తున్న ఆర్భాటాలు ప్రచారానికే పరిమితమయ్యాయని ఆరోపించారు. వరద నష్టం, రైతుల కష్టాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు తెలియచేస్తామని చెప్పారు.
ఇవీ చదవండి: