Janasena Leaders Audit By Jagananna colonies: రాష్ట్రవ్యాప్తంగా జనసేన నాయకులు "జగనన్న ఇళ్లు - పేదల కన్నీళ్లు" కార్యక్రమాన్ని నిర్వహించారు. గుంటూరు, కర్నూలు, కోనసీమ, పల్నాడు, డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ, బాపట్ల, ఎన్టీఆర్ జిల్లాల్లో జగనన్న కాలనీల నిర్మాణ పనులను జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పరిశీలించారు. కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలంలో జగనన్న కాలనీల్లో కనీస సౌకర్యాలు లేవని..పేదలు ఇళ్లు ఎలా నిర్మిస్తారని.. జనసైనికులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలోని.. జగనన్న కాలనీల్లో జరుగుతున్న ఇళ్ల నిర్మాణం గురించి లబ్ధిదారులతో మాట్లాడారు. గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పేరేచర్ల గ్రామంలో జగన్న కాలనీల్లో లబ్ధిదారులతో జనసైనికులు మాట్లాడారు. అప్పు చేసి ఇంటి నిర్మాణాలు చేపట్టారని కనీస సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
ఇవీ చదవండి: