Pawan Kalyan Comments: ప్రాణహాని ఉందని వైసీపీ ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి ఆందోళన చెందుతున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఆనం రాంనారాయణరెడ్డికి కేటాయించిన రక్షణ సిబ్బందిని సైతం తగ్గించారని ఆరోపించారు. ఆనం రక్షణకు తగిన ఏర్పాట్లు చేయాలని.. ఆ బాధ్యతను డీజీపీ తీసుకోవాలని పేర్కొన్నారు. డీజీపీ బాధ్యత తీసుకోని పరిస్థితిలో.. రాష్ట్రంలో పరిస్థితిని హోంశాఖ లేఖ ద్వారా వివరిస్తానని స్పష్టం చేశారు.
అధికార పార్టీ ఎమ్మెల్యేలే ప్రాణహానితో భయపడే పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయని అన్నారు. ఎమ్మెల్యేలు స్వేచ్ఛగా మాట్లాడుకునే హక్కులేదని పేర్కొన్నారు. ఆనం ప్రాణహాని వ్యాఖ్యలపై ప్రభుత్వం ప్రజలకు ఏం వివరణ ఇస్తుందని ప్రశ్నించారు. సీఎంపై కోటంరెడ్డి చేసిన ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై డీజీపీ, హోంమంత్రి ఎందుకు మాట్లాడట్లేదని అన్నారు. కోటంరెడ్డి చేసిన ఫోన్ ట్యాపింగ్ వ్యాఖ్యలపై ప్రభుత్వం ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
-
శ్రీ ఆనం రాంనారాయణ రెడ్డి గారి ప్రాణ రక్షణ బాధ్యత డీజీపీ తీసుకోవాలి..
— JanaSena Party (@JanaSenaParty) February 2, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
• శాసనసభ్యులే ప్రాణ హానితో భయపడే పరిస్థితులు వచ్చాయి pic.twitter.com/SP46geFNh9
">శ్రీ ఆనం రాంనారాయణ రెడ్డి గారి ప్రాణ రక్షణ బాధ్యత డీజీపీ తీసుకోవాలి..
— JanaSena Party (@JanaSenaParty) February 2, 2023
• శాసనసభ్యులే ప్రాణ హానితో భయపడే పరిస్థితులు వచ్చాయి pic.twitter.com/SP46geFNh9శ్రీ ఆనం రాంనారాయణ రెడ్డి గారి ప్రాణ రక్షణ బాధ్యత డీజీపీ తీసుకోవాలి..
— JanaSena Party (@JanaSenaParty) February 2, 2023
• శాసనసభ్యులే ప్రాణ హానితో భయపడే పరిస్థితులు వచ్చాయి pic.twitter.com/SP46geFNh9
ఇవీ చదవండి: