గుంటూరు జిల్లా వినుకొండలో తొమ్మిదెకారాల జామాయిల్ తోట దగ్ధమైంది. గుర్తుతెలియని దుండగులు.. అర్థరాత్రి సమయంలో తోటకు నిప్పంటించారు. వినుకొండ మండలం నరగాయపాలెం గ్రామానికి చెందిన.. నలుగురు రైతులు జామాయిల్ సాగు చేస్తున్నారు. కొందరు వ్యక్తులు ఆ తోటకు నిప్పంటించటంతో.. కాలి బూడిదైంది. దీంతో రూ.8లక్షలు నష్టపోయినట్లు రైతులు విలపిస్తున్నారు. తోటలో మంటలను ఆర్పేందుకు.. అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని చర్యలు చేపట్టారు. బాధిత రైతుల నుంచి స్టేట్మెంట్ రికార్డు చేసుకుని.. వీఆర్వో ఉన్నతాధికారులకు అందజేశారు. ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: రబీ పైర్లకు నీటి కటకట