Jagananna smart town ship: రాష్ట్రంలో మధ్య తరగతి ప్రజల సొంతింటి కలను నెరవేర్చేందుకు ఉద్దేశించిన జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్స్ పథకానికి సంబంధించిన వెబ్‌సైట్‌ను ముఖ్యమంత్రి జగన్ ఈరోజు ప్రారంభించనున్నారు. మొదటి దశలో అనంతపురం జిల్లా ధర్మవరం, గుంటూరు జిల్లా మంగళగిరి మండల పరిధిలోని నవులూరు, కడప జిల్లా రాయచోటి, ప్రకాశం జిల్లా కందుకూరు, నెల్లూరు జిల్లా కావలి, పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు లేఅవుట్లలో అమలు చేస్తారు. నేటి నుంచి http://migapdtcp.ap.gpv.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు.
కంప్యూటరైజ్డ్ లాటరీ ద్వారా అత్యంత పారదర్శకంగా ప్లాట్లను కేటాయిస్తారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలకు విస్తరించనున్నారు. రూ.18 లక్షల వరకు వార్షికాదాయం ఉన్న అర్హులైన కుటుంబాలకు సరసమైన ధరలకు నివాస స్థలాలు కేటాయిస్తారు. ఏడాది కాలంలో వీటిని అభివృద్ధి చేస్తారు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి లేఅవుట్‌లో 10% పాట్లు, 20% రిబేటుతో కేటాయిస్తారు. నిర్దేశిత మొత్తాన్ని ఏడాది కాలంలో నాలుగు వాయిదాల్లో చెల్లించే వెసులుబాటు ఉంటుంది. ఏకమొత్తంగా చెల్లించే వారికి 5% మేరకు రాయితీ కల్పిస్తారు. అన్ని రకాల వసతులతో టౌన్‌షిప్‌లను అభివృద్ధి చేస్తారు.
ఇదీ చదవండి:
CBN ON YSRCP ATTACKS IN KUPPAM: క్వారీ అక్రమాలు ప్రశ్నించినందుకే.. వైకాపా దాడులు: చంద్రబాబు