ETV Bharat / state

Mopidevi: 'ఏపీకి వ్యతిరేకంగా తెలంగాణలో నిర్ణయాలు తీసుకుంటే చూస్తూ ఊరుకోం' - జగనన్న కాలనీలపై ఎంపీ మోపిదేవి

కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ సీఎం జగన్ పేదల అభ్యున్నతికి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకటరమణ కొనియాడారు. అర్హులైన పేదలకు చేపట్టిన ఇళ్ల నిర్మాణాలను.. అనుకున్న సమయం కంటే ముందే పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. తెలంగాణతో జలజగడంపై స్పందించిన ఎంపీ.. రాష్ట్రానికి నష్టం జరుగుతుంటే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదని స్పష్టం చేశారు.

jagananna colonies  inaugurated by mp mopidevi at guntur
పేదల అభ్యున్నతి కోసం సంక్షేమ పథకాలు అమలు
author img

By

Published : Jul 4, 2021, 5:21 PM IST

అర్హులైన పేదలకు ఇళ్ల నిర్మాణాలు అనుకున్న సమయం కంటే ముందే పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ చెప్పారు. గుంటూరు జిల్లా రేపల్లె పట్టణం 18 వార్డు శివారులోని జగనన్న కాలనీలో పలు ఇళ్ల నిర్మాణాలకు, 13వ వార్డులో వైఎస్సార్ పట్టణ ఆరోగ్య కేంద్రం నూతన భవనానికి ఆయన శంకుస్థాపన చేశారు. ప్రతి పేదవాడి సొంతింటి కల నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి జగన్ కృషి చేస్తున్నారని చెప్పారు.

కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ సీఎం జగన్ పేదల అభ్యున్నతికి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని కొనియాడారు. కృష్ణా నదీ జలాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు సరైంది కాదని ఎంపీ వ్యాఖ్యనించారు. తెలుగు రాష్ట్రాలు విడిపోయినప్పుడు జలాలపై స్పష్టమైన నిర్ణయాలు తీసుకున్నారన్నారు. ఏపీకి అన్యాయం జరిగేలా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటే చూస్తూ ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు.

ఇదీ చదవండి:

'నీళ్లు పుష్కలంగా ఉన్నప్పుడు విద్యుదుత్పత్తి చేసుకోండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.