ETV Bharat / state

మహిళలకిచ్చిన హామీలను జగన్ నిలబెట్టుకోలేదు: లోకేశ్

వైకాపా ప్రభుత్వంపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు మహిళలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదని విమర్శించారు. దిశ చట్టం ఎక్కడా అమలు కావట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

nara lokesh
nara lokesh
author img

By

Published : Oct 14, 2020, 11:56 PM IST

ఎన్నికల ముందు మహిళలకు ఇచ్చిన ఒక్క హామీనీ ముఖ్యమంత్రి జగన్ నిలబెట్టుకోలేదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోందని ధ్వజమెత్తారు. వైకాపా పాలనలో మహిళలు అనేక కష్టాలు పడుతున్నారని దుయ్యబట్టారు. బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయమైన ఎన్టీఆర్ భవన్​లో తెలుగు మహిళా పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. ఇంట్లో పిల్లలందరికీ అమ్మ ఒడి, 45 ఏళ్లకే పింఛన్, సంపూర్ణ మద్య నిషేధం వంటి అనేక హామీలను జగన్ బుట్టదాఖలు చేశారని లోకేశ్ మండిపడ్డారు. విద్యుత్, గ్యాస్, నిత్యావసరాల ధరలు విపరీతంగా పెంచేశారని దుయ్యబట్టారు. దిశ చట్టం ఎక్కడా అమలు కావట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 17 నెలల్లో ఒక్క మహిళకు కూడా న్యాయం జరగలేదన్న లోకేశ్... వైకాపా నాయకులే మహిళలపై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. జై అమరావతి ఉద్యమంలో మహిళలు చూపిన పోరాట స్ఫూర్తి అన్ని జిల్లాలోనూ రావాలని పిలుపునిచ్చారు.

కష్టపడేవారికే పదవులు

కష్టపడే వారికే పార్టీలో పదవులు, గుర్తింపు ఉంటుందని నూతన తెలుగు మహిళ పార్లమెంట్ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులకు లోకేశ్ స్పష్టం చేశారు. పదవులను అలంకారంగా భావించే వారికి 3నెలల్లో మార్పు తప్పదని హెచ్చరించారు. అనుబంధ సంఘాలు పార్టీ నీడలో పనిచేయకుండా సొంత అజెండాతో ముందుకెళ్లాలని సూచించారు. జరిగిన తప్పులు బేరీజు వేసుకుని పూర్తి ప్రక్షాళనకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. అధికారంలోకి వస్తే అనుబంధ సంఘాలకు గుర్తింపు ఉండదు అనే భయం వీడాలని... మహిళల కోసం తీసుకునే ప్రతి నిర్ణయంలో భాగస్వామ్యుల్ని చేస్తామని హమీ ఇచ్చారు.

ఇదీ చదవండి:

'ఏపీలో పరిస్థితి ఎలా ఉంది?'... సీఎం జగన్​కు ప్రధాని ఫోన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.