జాతీయస్థాయి వైద్యవిద్య ప్రవేశ పరీక్ష.. నీట్లో ర్యాంకు రావాలంటే కఠోర శ్రమతో పాటు ఏకాగ్రత అవసరం. పట్టుదలకు తోడు తగిన కార్యాచరణ, సన్నద్ధత, సమయపాలన, అంశాల వారీగా అధ్యయనం లాంటి ఆయుధాలు ఎన్నో అవసరం అవుతాయి. ఇవన్నీ ఒక ఎత్తైతే పరీక్షల్లో వాటిని అమలు చేస్తూ రాయడం మరో ఎత్తు. ఇన్ని సవాళ్లను అధిగమించి నీట్లో జాతీయ స్థాయి ఓపెన్ కేటగిరీలో ఆరో ర్యాంకు, రాష్ట్రంలో టాపర్గా నిలిచింది గుంటూరు జిల్లా తెనాలికి చెందిన చైతన్య సింధు.
వైద్య కుటుంబం నుంచి..
వైద్యుల కుటుంబం నుంచి వచ్చిన చైతన్య సింధు.. పరీక్షలకు అనవసర భయాన్ని వీడాలని.. ప్రణాళికాబద్ధంగా కష్టపడితే ర్యాంకు సాధించవచ్చంటున్న చైతన్య సింధుతో ఈటీవీ భారత్ ప్రతినిధి సూర్యారావు ముఖాముఖి.