ETV Bharat / state

ఐఆర్​ఎస్​ అధికారి జాస్తి కృష్ణ కిశోర్​కి పదోన్నతి

author img

By

Published : Apr 22, 2020, 6:54 PM IST

Updated : May 5, 2020, 12:11 PM IST

irs-officer-jasti-krishna-kishore-got-promotion
ఐఆర్​ఎస్​ అధికారి జాస్తి కృష్ణ కిశోర్​కి పదోన్నతి

18:43 April 22

ఇన్నాళ్లు లూప్​లో ఉన్న ఐఆర్​ఎస్​​ అధికారి ​జాస్తి కృష్ణ కిశోర్​కు బాధ్యతలు కేంద్రం అప్పగించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనకు ప్రిన్సిపల్ కమిషనర్ ఆఫ్ ఇన్​కం టాక్స్ అధికారిగా పదోన్నతి ఇచ్చింది... ఆర్థిక శాఖలోని రెవెన్యూ విభాగం. ఈనెల 25 నుంచి ఉత్తర్వులు అమలులోకి వస్తాయని పేర్కొంది. దిల్లీలోని ప్రిన్సిపల్ కమిషనర్ ఇన్​కం టాక్స్ అధికారిగా జాస్తి కృష్ణ కిశోర్​ను కేంద్రం నియమించింది.  ఈయన విషయంలో అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. 

తెలంగాణకు శ్రీనివాసరాజు 

తితిదే జేఈఓ శ్రీనివాసరాజును తెలంగాణకు డిప్యుటేషన్​పై వెళ్లేందుకు అనుమతి ఇచ్చిన కేంద్రం. ప్రస్తుతం ఈయన ఆంధ్రప్రదేశ్ క్యాడర్​లో ఉన్నారు. మూడేళ్లపాటు తెలంగాణ క్యాడర్​లో కొనసాగేందుకు అవకాశం ఇస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది డీఓపీటీ. జేఈఓ నుంచి తప్పుకున్న తరువాత శ్రీనివాసరాజు సెలవులో ఉన్నారు.  

ఇదీ చదవండి: 'పాత్రికేయులూ.. కరోనా పట్ల జాగ్రత్త వహించండి'

Last Updated : May 5, 2020, 12:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.