Irregularities in AP Voter List: రాష్ట్రంలో ఓట్ల జాబితాలో అక్రమాలు కలవరపరుస్తున్నాయి. ముఖ్యంగా ఓట్ల తొలగింపు కోసం వినియోగించే ఫామ్-7 దరఖాస్తు.. ఈ ఏడాది జూన్ నుంచి సెప్టెంబర్ నెలాఖరులోపు.. 7లక్షల వరకూ నమోదుకావడం విపక్షాల ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. ఒక వ్యక్తి 5కంటే ఎక్కువ ఫామ్-7 లు పెట్టకూడదనే నిబంధనలు ఉన్నప్పటికీ.. దాదాపు 5వేల మందికిపైగా ఇందుకు విరుద్ధంగా వ్యవహరించారు.
TDP Sympathizers Votes Deletion: కావలిలో అత్యధికంగా 813మంది.. నెల్లూరు అర్బన్‌లో 187, కుప్పంలో 182, వినుకొండలో 177, రాజంపేటలో 154, మడకశిర, సర్వేపల్లిలో 125మంది చొప్పున.. 5కంటే ఎక్కువ ఫామ్-7లు దరఖాస్తు చేసిన వారున్నారు. రాప్తాడులో 122మంది, నర్సీపట్నంలో 116, నెల్లూరు గ్రామీణంలో 113, మంత్రాలయంలో 112, పర్చూరులో 109మంది 5కంటే ఎక్కువ ఫామ్-7 దరఖాస్తులను నమోదు చేశారు.
Voter Deletion: ఓట్ల తొలగింపుపై.. విశాఖ కలెక్టరేట్‌కు పోటెత్తిన జనం..
YCP Diversion Politics: వచ్చిన ఫామ్-7లలో ఈసీ కొన్ని తిరస్కరించవచ్చు.., మరికొన్నింటిని పరిగణలోకి తీసుకోవచ్చు. ఎన్నింటిని అంగీకరించారనే విషయం.. నమూనా ఓటర్ల జాబితా విడుదల చేసినప్పుడే తెలుస్తుంది. ఈలోపు వైసీపీ ఎన్ని కుట్రలకైనా తెగబడుతోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. గంపగుత్తుగా చేత్తో గాని, ఆన్‌లైన్ ద్వారా గాని అప్లికేషన్‌లు దాఖలు చేసినప్పుడు వాటిని తిరస్కరించే అధికారం ఈఆర్ఓకు ఉంది.
Votes Deletion in AP: చనిపోయిన వారి విషయంలో మరణ ధృవీకరణ పత్రం జత చేయాలి లేదా బీఎల్ఓ పంచనామా చేసిన తర్వాత తొలగించాలి. చదువులు, ఉద్యోగాలు, కూలీ పనుల నిమిత్తం.. ఊరు వదిలి వెళ్లారనే కారణంతో ఓటును తీసేసే హక్కు ఎవరికీ లేదు. నోటీసు ఇవ్వకుండా.. ఫామ్-7 ద్వారా ఓటు తొలగించే హక్కు కూడా అధికారులకు లేదు.
YSRCP Removing TDP Supporters Votes: ఒక వేళ ఫామ్-7 ఇవ్వకుండా ఓటు తొలగిస్తే సదరు వ్యక్తి వెంటనే ఫిర్యాదు చేయాలి. మళ్లీ ఫామ్ -6ను నమోదు చేసుకుని ఓటు హక్కు పొందవచ్చు. బాబు అరెస్టుపై తాము ఆందోళనలతో రోడ్డెక్కితే.. వైసీపీ ఓట్లలో మాయాజలం చేస్తోందని.. తెలుగుదేశం ఆరోపిస్తోంది. ఇలా ఇప్పటివరకు 13 లక్షల ఓట్లు తొలగించారని టీడీపీ నేతలు చెబుతున్నారు.
Votes Deletion: ప్రజా వ్యతిరేకత తట్టుకోలేక.. మళ్లీ ఎన్నికల్లో గెలిచే సత్తా లేక.. వైసీపీ నాయకులు.. బీఎల్ఓలు, వాలంటీర్ల అండతో.. అక్రమంగా గెలవాలని చూస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అనేక నియోజకవర్గాల్లో.. వందల ఓట్ల తేడాతోనే అభ్యర్థుల ఫలితం తారుమారవుతుంది. గత ఎన్నికల్లో దాదాపు 30వరకు నియోజకవర్గాల్లో ఈ తరహా ఫలితమే వచ్చింది.
Opposition Sympathizers Votes Removed: ఈ నెలాఖరులో వచ్చే నమూనా ఓటరు జాబితాలో ఎన్ని ఓట్లు తొలగించారో చూసుకుని దాన్ని బట్టి జనవరిలో విడుదలయ్యే తుది జాబితాలోపు మార్పులూ, చేర్పులూ చేసుకోవాల్సి ఉంటుంది. ఈలోగా అక్రమాలు జరగకుండా కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని.. విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.