మనస్తాపంతో ఓ బాలిక ఆత్మహత్య చేసుకున్న సంఘటన.. గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం సేవనాయక్ తండాలో జరిగింది. చిన్న విషయమై కుటుంబంలో స్వల్ప వివాదం జరగ్గా.. రమావత్ హారిక అనే బాలిక బావిలో దూకి ప్రాణాలు తీసుకుంది.
పదహారేళ్ల రమావత్ హారిక ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. అనుకోని ఈ ఘటనతో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం మాచర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వెల్దుర్తి పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: