గుంటూరు జిల్లా నాగర్జున విశ్వవిద్యాలయంలో అంతర్ జిల్లా క్రీడా పోటీలు ఉత్సహంగా సాగుతున్నాయి. బుధవారం 100, 200, 800 మీటర్ల పరుగు పందెం, డిస్కస్ త్రో, షాట్ పుట్, లాంగ్‌జంప్, హై జంప్ పోటీలు నిర్వహించారు. రెండో రోజు పతకాల వేటలో విశాఖ, ప్రకాశం, విజయనగరం జిల్లాలు ముందు వరుసలో ఉన్నాయి.
విజయనగరం 17, ప్రకాశం 20, విశాఖ 20, గుంటూరు జిల్లా 15, కృష్ణా 14 పతకాలను తమ ఖాతాలో వేసుకున్నాయి. రెండో రోజు దాదాపు 63 విభాగాలలో పోటీలు జరిగాయి. విజేతలకు శాప్ అధికారులు బహుమతులు ప్రదానం చేశారు. గురువారంతో పోటీలు ముగియనున్నాయి.
ఇదీ చదవండి: