పొగాకు ఎగుమతులపై సుంకం రద్దు చేయాలని ఇండియన్ టొబాకో అసోసియేషన్ అధ్యక్షుడు మద్ది వెంకటేశ్వరరావు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గుంటూరులోని ఐటీఏ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఆర్వోడీటీఈపీ స్కీం కింద వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులపై సుంకం రద్దు చేసిన ప్రభుత్వం.. పొగాకును మాత్రం అందులో చేర్చకపోవటాన్ని ఆయన తప్పుబట్టారు.
అన్ని రకాల విదేశీ ఎగుమతులు 400 బిలియన్ డాలర్లకు పెంచాలని లక్ష్యం నిర్దేశించిన ప్రధాని మోదీ ఈ విషయంలో తమకు వెసులుబాట్లు కల్పించాలని కోరారు. ఓవైపు పొగాకు సాగుని తగ్గిస్తూ.. మరోవైపు ఎగుమతులు పెంచాలని కోరటం అసంబద్ధంగా ఉందన్నారు. అందుకే పొగాకు ఎగుమతుల్లో 5శాతం మేర ఎగుమతిదారులకు తిరిగి చెల్లించాలని కోరారు. కేంద్ర వాణిజ్యపన్నుల శాఖకు ఈ మేరకు ప్రతిపాదనలు పంపించినట్లు చెప్పారు.
ఇదీ చదవండి: