ETV Bharat / state

గుంటూరు జిల్లాలో గుబులు రేపుతున్న కరోనా కేసులు - latest updates of corona

గుంటూరు జిల్లాలో కరోనా కేసుల ఉద్ధృతి గుబులు రేపుతోంది. ఐదు రోజుల వ్యవధిలో 64 కేసులు నమోదు కావటం పరిస్థితి తీవ్రతకు నిదర్శనంగా నిలుస్తోంది. అప్రమత్త చర్యలు కొరవడటమే ఇందుకు కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరిన్ని పరీక్షల ఫలితాలు రావాల్సి ఉన్నందున ఆందోళన నెలకొంది.

increasing-corona-cases-in-guntur-district

author img

By

Published : Apr 15, 2020, 5:00 AM IST

రోజురోజుకీ పెరుగుతున్న కరోనా కేసులతో గుంటూరు జిల్లా వ్యాప్తంగా అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. జిల్లాలో మొదటి కేసు నమోదైన 20 రోజుల్లోనే వైరస్‌ సోకిన వారి సంఖ్య 114కి చేరటం ఆందోళన రేపుతోంది. రాష్ట్రంలో మార్చి 13న తొలికేసు నమోదు కాగా... గుంటూరు జిల్లాలో మార్చి 25న గుర్తించారు. దిల్లీలో మర్కజ్‌కు వెళ్లి వచ్చిన 52 ఏళ్ల వ్యక్తికి పాజిటివ్ అని తేలింది. ఆ తర్వాత మార్చి 27న అతని భార్యకు, 28న మాచర్లకు చెందిన మరో ఇద్దరికి వైరస్‌ సోకినట్లు వెల్లడైంది. ఈనెల 10 వరకూ జిల్లాలో నమోదైన కేసులు 50 మాత్రమే. ఆ తర్వాత కేవలం 5 రోజుల వ్యవధిలో మరో 64 కేసులు నమోదయ్యాయి.

పరిస్థితి తీవ్రరూపం...

గుంటూరు జిల్లాలో పాజిటివ్ వచ్చిన వారి కుటుంబ సభ్యులను ఆస్పత్రులకు తరలించారు. వారు కలిసిన వారిని మాత్రం క్వారంటైన్ కేంద్రాల్లో ఉంచారు. ఇదే వైరస్ వ్యాప్తికి కారణమైనట్లు తెలుస్తోంది. పాజిటివ్ కేసులతో సంబంధం ఉన్న వారిని, వారిని కలిసిన వారిని కూడా ఆస్పత్రుల్లోని ఐసొలేషన్ విభాగాల్లో చేర్చి ఉంటే పరిస్థితి ఇంత తీవ్రరూపం దాల్చేది కాదనే భావన వ్యక్తమవుతోంది. అనుమానితుల తరలింపులోనూ ఉదాసీనత కనిపించింది. ఆసుపత్రుల్లో పడకలు అందుబాటులో ఉన్నదాన్ని బట్టే వారిని చేర్చుకున్నారు. లేకుంటే ఇళ్లలోనే ఉంచారు. ఫలితంగా.. ఆ ఇళ్లలో మిగిలిన కుటుంబ సభ్యులకూ కరోనా సోకింది. ఒకే ఇంట్లో 4కు మించి పాజిటివ్ కేసులు మొత్తం 6 ప్రాంతాల్లో నమోదు కావడమే ఇందుకు నిదర్శనం. గుంటూరు నగరంలో 88 కేసులుండగా.. మిగతా 26 గ్రామీణ ప్రాంతాల్లో నమోదయ్యాయి. నగరాల్లోని వారు ఇరుకిళ్లలో ఉండటం, ఒకే మరుగుదొడ్డి ఉపయోగించటం లాంటివి వైరస్ వ్యాప్తికి కారణమైనట్లు తెలుస్తోంది.

ప్రత్యేకాధికారిగా సీనియర్ ఐఏఎస్

గుంటూరులో కరోనా చికిత్సకు కేటాయించిన ఐడీ ఆస్పత్రిలో కేవలం 10 పడకలే ఉన్నాయి. రోగులు పెరిగాకే మరో 15 పడకలు అందుబాటులోకి తెచ్చారు. జీజీహెచ్‌లో మొదట్లో కరోనా అనుమానితులను ఐసొలేషన్‌లో ఉంచి చికిత్స అందించినా... తర్వాత ఆపేశారు. ప్రస్తుతం కేసుల సంఖ్య పెరుగుతున్నందున సీనియర్ ఐఏఎస్ అధికారి బి.రాజశేఖర్‌ను జిల్లాకు ప్రత్యేక అధికారిగా నియమించారు. ప్రస్తుతం ఐసొలేషన్ ప్రక్రియను కచ్చితంగా అమలు చేస్తున్నారు. మరో వారం రోజుల్లో కేసుల తీవ్రత తగ్గుముఖం పడుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

గుంటూరు నగరంలో వైరస్ నియంత్రణకు అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు ఉద్ధృతం చేశారు. ప్రభావిత ప్రాంతాల్లో హ్యాండ్ స్ప్రేయర్లు, ఫైరింజన్ల సాయంతో క్రమం తప్పకుండా సోడియం హైపో క్లోరైడ్ ద్రావణం పిచికారీ చేస్తుండగా... ఇవాళ చెన్నై నుంచి సరికొత్త యంత్రం తెప్పించారు. బెల్ కంపెనీ తయారు చేసిన మూడున్నర లక్షల ఖరీదైన స్ప్రేయర్ ద్వారా మరింత సమర్థంగా రసాయనాల పిచికారీ చేయవచ్చని చెబుతున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ ప్రాంతాల్లో ప్రక్రియ పూర్తి చేసే వీలు కలగనుంది. ప్రస్తుతం కంటైన్మెంట్ జోన్లలో ఈ పరికరం ద్వారా రసాయనాల పిచికారీ చేస్తున్నారు.

ఇదీ చదవండి :

గుంటూరు జిల్లాలో ఆర్​ఎంపీ వైద్యుడికి కరోనా పాజిటివ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.